Telugu Global
Telangana

రేవంత్‌పై సీనియర్ల పైచేయి..!

తుంగతుర్తి విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. తుంగతుర్తి టికెట్‌పై అద్దంకికి గతంలోనే రేవంత్ హామీ ఇచ్చారు. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అద్దంకికి టికెట్‌కు మోకాలడ్డు పెట్టారని తెలుస్తోంది.

రేవంత్‌పై సీనియర్ల పైచేయి..!
X

కాంగ్రెస్‌లో సీనియర్లు అనుకున్నది సాధించారు. టికెట్ల విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌ను కాదని తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. రేవంత్‌ సూచించిన అభ్యర్థులను కాదని.. తమ వారికి టికెట్లు ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్‌ చివరి లిస్ట్‌సైతం ఇదే విషయాన్ని నిరూపించింది.

ప్రధానంగా సూర్యాపేట టికెట్‌ కోసం రేవంత్ అనుచరుడు పటేల్‌ రమేష్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు. 2018లోనూ పటేల్ రమేష్‌ రెడ్డికి టికెట్ దక్కలేదు. దీంతో ఈసారి ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని పట్టుదలతో ప్రయత్నించారు. రేవంత్ సైతం పటేల్ రమేష్‌ రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు తనవంతు ప్రయత్నాలు చేశారు. అయితే సూర్యాపేట టికెట్‌ మాజీమంత్రి, సీనియర్ నేత దామోదర్ రెడ్డికే ఇవ్వాలని ఎంపీ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆ టికెట్‌ రాంరెడ్డికే కేటాయించింది అధిష్టానం.

ఇక తుంగతుర్తి విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. తుంగతుర్తి టికెట్‌పై అద్దంకికి గతంలోనే రేవంత్ హామీ ఇచ్చారు. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అద్దంకికి టికెట్‌కు మోకాలడ్డు పెట్టారని తెలుస్తోంది. మునుగోడు ఉపఎన్నిక సమయంలో అద్దంకి చేసిన వ్యాఖ్యలను మనసులో పెట్టుకున్న కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి టికెట్ రాకుండా అడ్డుకున్నారని ప్రచారం జరుగుతోంది. అద్దంకికి కాకుండా మరెవరికి టికెట్‌ ఇచ్చిన ఒకే అని కోమటిరెడ్డి చెప్పినట్లు సమాచారం. దీంతో తుంగతుర్తి టికెట్‌ను పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న అద్దంకికి కాకుండా.. బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన మందుల శామ్యూల్‌కు ఇచ్చారు.

ఇక మరో పటాన్‌చెరు నియోజకవర్గంలోనూ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ అనుకున్నది సాధించారు. ఎట్టకేలకు తన అనుచరుడు కాటా శ్రీనివాస్ గౌడ్‌కు టికెట్ దక్కెలా ఒప్పించగలిగారు. మొదటగా పటాన్ చెరు టికెట్‌ ఇటీవల పార్టీలో చేరిన నీలం మధు ముదిరాజ్‌కు కేటాయించినప్పటికీ.. ఆయనను తప్పించి కాటా శ్రీనివాస్‌ గౌడ్‌కు టికెట్ కన్ఫామ్ చేయించారు. మొత్తంగా మూడు నియోజకవర్గాల్లో రేవంత్ అభిప్రాయాన్ని కాదని.. తమ మాట నెగ్గించుకున్నారు సీనియర్లు.

First Published:  10 Nov 2023 3:16 AM GMT
Next Story