లగచర్ల ఘటనలో లొంగిపోయిన ఏ2 నిందితుడు సురేష్
వికారాబాద్ లగచర్ల ఘటనలో కీలక పరిమాణం చోటుచేసుకుంది. జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్‌పై దాడి కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సురేష్ నేడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
వికారాబాద్ లగచర్ల ఘటనలో కీలక పరిమాణం చోటుచేసుకుంది. జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్‌పై దాడి కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సురేష్ నేడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో పోలీసులు సురేష్ ను కోడంగల్ కోర్టులో హాజరు పరిచారు. సురేష్ కు 14 రోజుల రిమాండ్ విదించింది కోర్టు. సురేష్ ను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. దాడి జరిగిన రోజు నుంచి సురేష్ పరారీలో ఉండగా.. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అనూహ్యంగా నేడు వికారాబాద్ పోలీసుల ఎదుట సురేష్ స్వయంగా లొంగిపోయాడు. సురేష్ కోసం వారం రోజులుగా గాలించారు.
దీంతో పోలీసులు సురేష్ ను కోడంగల్ కోర్టులో హాజరు పరిచారు. కలెక్టర్ బృందాన్ని ప్రజాభిప్రాయ సేకరణ వేదిక వద్ద నుంచి ఊరిలోకి తీసుకెళ్లడంలో నిందితుడు సురేశ్ కీలకంగా వ్యవహరించాడు. అక్కడికి వెళ్లిన వెంటనే ఆందోళనకారులు నినాదాలు చేస్తూ ముందుకు దూసుకురావడంతో గందరగోళం నెలకొంది. ఆ సమయంలో సురేశ్ సైతం నినాదాలు చేసినట్లు వీడియోల్లో కనిపించడంతో ఆయనే పక్కా పథకంతో అధికారుల్ని అక్కడికి రప్పించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పటికే వారిని రెచ్చగొట్టి దాడికి సిద్ధం చేసి ఉంటాడని.. కలెక్టర్ వాహనం దిగిన క్షణాల వ్యవధిలోనే ఆందోళనకారులు ఆయనపైకి దూసుకురావడంతోపాటు వెంకట్‌రెడ్డిని వెంటాడి కొట్టేందుకు అదే కారణమై ఉంటుందని నమ్ముతున్నారు.