Telugu Global
Telangana

సీజేఐకి సుప్రీంకోర్టు వీడ్కోలు

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ కు సుప్రీం ధర్మాసనం వీడ్కోలు పలికింది.

సీజేఐకి సుప్రీంకోర్టు వీడ్కోలు
X

భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌‌కు దేశ అత్యున్నత ధర్మాసనం వీడ్కోలు పలికింది. ఆయన ఈనెల 10న పదవీ విరమణ చేయనున్నారు. అయితే శని, ఆదివారాల్లో కోర్టుకు సెలవులు ఉండటంతో ఇవాళే లాస్ట్‌ వర్కింగ్‌ డే కావడంతో సుప్రీం ధర్మాసనం వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తిగా చివరి సందేశం ఇచ్చారు. వృత్తి పరంగా తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానన్నారు. ‘రేపటి నుంచి ఉన్నత న్యాయస్థానం నుంచి తీర్పులు ఇవ్వలేననేది నిజం. అయినప్పటికీ నేను వృత్తిపరంగా పూర్తి సంతృప్తిగా ఉన్నాను’ అని తెలిపారు. కాగా, సీజేఐ చంద్రచూడ్‌ 2022 నవంబర్‌ 8 నుంచి ఈ పదవిలో ఉన్నారు.

సీజేఐ చివరి తీర్పు ఇచ్చారు. అలీఘ‌డ్ ముస్లిం యూనివ‌ర్సిటీకి మైనార్టీ హోదా విషయంలో కీలక తీర్పు వెలవరించారు. దీన్ని మైనార్టీ విద్యాసంస్థగా పరిగణించలేమంటూ 1967లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. అయితే, దీనికి మైనార్టీ హోదా ఉండాలా? వద్దా? అన్న అంశాన్ని తేల్చేందుకు ఈ పిటిషన్లను కొత్త బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు సీజేఐ నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. మరోవైపు, భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఆయన సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే సీజేఐ ఆరు నెలలు మాత్రమే పదవిలో ఉంటారు

First Published:  8 Nov 2024 12:23 PM GMT
Next Story