హైదరాబాద్ లో మండుతున్న ఎండలు... అత్యవసరమైతే తప్ప బైటికి రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిక
IMD-Hyderabad ప్రకారం , రాబోయే కొద్ది రోజులలో పొడి వాతావరణం పెరుగుతుంది. చెప్పుకోదగ్గ వర్షపాతం లేకపోవడం వల్ల నగరంలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. ప్రజలు పగటిపూట బయటకు వెళ్లకపోవడమే మంచిదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
కొద్ది పాటి వర్షాలతో రెండు రోజుల పాటు చల్లబడ్డ హైదరాబాద్ మళ్ళీ మండిపోయే ఎండలతో వేడెక్కింది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు దాటాయని హైదరాబాద్ లోని భారత వాతావరణ శాఖ(IMD-H) తెలిపింది. ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.
IMD-H ప్రకారం , రాబోయే కొద్ది రోజులలో పొడి వాతావరణం పెరుగుతుంది. చెప్పుకోదగ్గ వర్షపాతం లేకపోవడం వల్ల నగరంలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. ప్రజలు పగటిపూట బయటకు వెళ్లకపోవడమే మంచిదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం, రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 23 డిగ్రీల సెల్సియస్‌కు పెరుగుతాయని తెలిపింది.
నిర్మల్, ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, మంచిర్యాలతో సహా కొన్ని జిల్లాల్లో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, అన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.