Telugu Global
Telangana

సూట్‌కేసులు మీకు.. అరెస్టులు మాకు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని కేటీఆర్‌ ఫైర్‌

సూట్‌కేసులు మీకు.. అరెస్టులు మాకు
X

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. 'కాంగ్రెష్‌ పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారు. పాలనలో లోపాలను గుర్తుచేసినా, గురుకులాల్లో విద్యార్థులు అవస్థలను పరిశీలించినా.. ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరించినా కేసులు పెడుతున్నారు. కూల్చుతున్న ఇళ్లకు అడ్డొచ్చినా.. వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సూట్‌కేసులు మీకు.. అరెస్టులు మాకు. మాజీ మంత్రులు, మా నాయకులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల అరెస్టు అప్రజాస్వామికం అన్నారు. తణం వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

First Published:  5 Dec 2024 11:59 AM IST
Next Story