Telugu Global
Telangana

సిరిసిల్ల నేత కార్మికుడి ఆత్మహత్య.. రేవంత్‌కు కేటీఆర్‌ వార్నింగ్

కాంగ్రెస్‌ పాలనలో నేతన్న బతుకుల తీరుపై ట్వీట్ చేశారు కేటీఆర్. కపట కాంగ్రెస్‌ పాలనలో అన్నదాత ఆగమైండు.. చేనేత కార్మికుడు చితికిపోతున్నాడంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు కేటీఆర్.

సిరిసిల్ల నేత కార్మికుడి ఆత్మహత్య.. రేవంత్‌కు కేటీఆర్‌ వార్నింగ్
X

సిరిసిల్లలో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శనివారం మృతుడు లక్ష్మినారాయణ కుటుంబాన్ని పరామర్శించి.. అండగా ఉంటామని భరోసా కల్పించారు. తక్షణ సాయం కింద రూ. 50 వేలు అందించారు. కలెక్టర్‌తో మాట్లాడి ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి సాయం అందేలా చూడాలన్నారు.

ఇక కాంగ్రెస్‌ పాలనలో నేతన్న బతుకుల తీరుపై ట్వీట్ చేశారు కేటీఆర్. కపట కాంగ్రెస్‌ పాలనలో అన్నదాత ఆగమైండు.. చేనేత కార్మికుడు చితికిపోతున్నాడంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు కేటీఆర్. ప్రభుత్వ వైఫల్యానికి తోడు పాలకుడి నిర్వాకం వల్ల నేతన్న నడిరోడ్డు మీద పడ్డారన్నారు కేటీఆర్. నాడు తెలంగాణ అవకాశాల గనిగా ఉండి చేనేత కార్మికుడికి చేతినిండా పని దొరికిందని.. ఇవాళ చేతకాని కాంగ్రెస్‌ పాలన కార్మికుల పాలిట శనిగా మారిందన్నారు.


బతుకమ్మ చీరల ఆర్డర్లు లేక, ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులు రాక.. నేతన్న దిక్కుతోచని స్థితిలో ఉన్నాడన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ తీసుకువచ్చిన సబ్సిడీ పథకాన్ని అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌ ప్రభుత్వం నిలువునా పాతరేసిందని మండిపడ్డారు. ఇలా ఇంకెంత అన్యాయాల జాతర చేస్తారంటూ మండిపడ్డారు కేటీఆర్. చేనేత కార్మికులను చిన్నచూపు చూస్తున్న.. భస్మాసుర హస్తానికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని మూలనపడ్డం మగ్గం సాక్షిగా హెచ్చరిస్తున్నాన్నారు కేటీఆర్.

First Published:  7 April 2024 1:29 PM IST
Next Story