Telugu Global
Telangana

చైతన్య కాలేజ్ విద్యార్థి సాత్విక్ సూసైడ్ నోట్ బహిర్గతం... ఆ నలుగురిని వదలొద్దని కోరిన సాత్విక్

కాలేజీ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, అడ్మిన్ ఆచార్య , వార్డెన్ నరేష్‌, టీచర్ శోభన్, నరేష్ టార్చర్ వల్లే తాను ఆత్మ హత్య చేసుకుంటున్నట్లు సాత్విక్ తన లేఖలో తెలిపాడు. ఆ నలుగురిని వదలొద్దని కోరాడు.

చైతన్య కాలేజ్ విద్యార్థి సాత్విక్ సూసైడ్ నోట్ బహిర్గతం... ఆ నలుగురిని వదలొద్దని కోరిన సాత్విక్
X

హైదరాబాద్ నార్సింగిలోని చైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మ‌హత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టిస్తోంది. కాలేజ్ యాజ‌మాన్యమే సాత్విక్ మరణానికి కారణమని ఆ విద్యార్థి తల్లితండ్రులు ఆరోపిస్తున్న నేపథ్యంలో సాత్విక్ రాసిన సూసైడ్ నోట్ బహిర్గతమైంది. కాలేజీలోని ఎవరెవరు తనను ఎలా టార్చర్ పెట్టారో వివరంగా రాసిన సాత్విక్ వారిని వదిలిపెట్టొద్దని కోరాడు.

కాలేజీ ప్రిన్సి పల్ కృ ష్ణారెడ్డి, అడ్మి న్ ఆచార్య , వార్డెన్ నరేష్‌, టీచర్ శోభన్, నరేష్ టార్చ ర్ వల్లే తాను ఆత్మ హత్య చేసుకుం టున్న ట్లు సాత్విక్ తన లేఖలో తెలిపాడు. ఆ నలుగురిని వదలొద్దని కోరాడు.

“నాన్నా .. నేను ఈ పని చేస్తున్నం దుకు క్షమిం చం డి. మిమ్మ ల్ని బాధ పెట్టాలని ఉద్దేశం నాకు లేదు. మీరు బాధపడితే నా ఆత్మ శాం తిం చదు. అన్నా .. అమ్మా నాన్న లను నువ్వే బాగా చూసుకోవాలి.

అన్నా .. నేను లేనిలోటును అమ్మా నాన్న లకు రానీయకు. ప్రిన్సిపల్, ఇన్‌ఛార్జ్, లెక్చరర్ల వల్లే చనిపోతున్నా . కృష్ణారెడ్డి,ఆచార్య , శోభన్, నరేశ్‌ వేధింపులు తట్టుకోలేకపోతున్నా . ఈ ముగ్గురూ హాస్టల్‌లో విద్యా ర్థులకు నరకం చూపిస్తున్నా రు. నన్ను వేధించిన ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోండి. అమ్మా , నాన్నా లవ్యూ, మిస్యూఫ్రెం డ్స్ .” అని సాత్విక్ తన సూసైడ్ లెటర్ లో రాశాడు.

మరో వైపు సాత్విక్ ఆత్మహత్య ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విద్యార్థి మృ తికి గల కారణాలపై విచారణ జరిపించి నివేదిక సమర్పించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇం ద్రారెడ్డి ఆదేశించారు.

First Published:  1 March 2023 7:22 PM IST
Next Story