చిహ్నంలో అమరవీరుల స్తూపం.. కేటీఆర్ ట్వీట్ వైరల్
తెలంగాణలో వేలాది మంది అమరులు అయింది ఎవరి వల్ల.. అమరుల స్తూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరి వల్ల అంటూ ఓ ట్వీట్ చేశారు.
తెలంగాణ అధికారిక చిహ్నం మార్పుపై రచ్చ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఐతే లోగో ఇలా ఉండబోతుంది.. అలా ఉండబోతుంది అంటూ సోషల్‌మీడియాలో రోజుకో ఫొటో వైరల్ అవుతోంది. తాజాగా అధికారిక చిహ్నంలో అమరవీరుల స్తూపం ఉండనుందంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఐతే తాజాగా ఈ అంశంపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
తెలంగాణలో వేలాది మంది అమరులు అయింది ఎవరి వల్ల.. అమరుల స్తూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరి వల్ల అంటూ ఓ ట్వీట్ చేశారు. 1952లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని.. హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని పోరాటం చేసిన విద్యార్థులపై సిటీ కాలేజీ దగ్గర కాల్పులు జరిపి 6 మందిని బలిగొన్నది ఎవరో కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అంటూ రాసుకొచ్చారు కేటీఆర్.
తెలంగాణాలో వేలాది మంది అమరులు అయ్యింది ఎవరి వల్ల? అమరులస్తూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరివల్ల?
— KTR (@KTRBRS) May 31, 2024
1952 లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్ధులపై సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి 6 మందిని బలిగొన్నది ఎవరు?
❌… pic.twitter.com/lsI2NMuCjm
1969 - 71 తొలి దశ ఉద్యమంలో 370 మంది తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు కేటీఆర్. 1971 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి 14 సీట్లకు గానూ.. 11 సీట్లలో గెలిస్తే ఆ పార్టీని మాయం చేసింది ఎవరు.. కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు కేటీఆర్. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజాస్వామికంగా, తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తే.. తెలంగాణను తుంగలో తొక్కింది కాంగ్రెస్ కాదా అన్నారు. 2004లో మాట ఇచ్చి, పదేళ్లు తాత్సారం చేసి వందలాది తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానం చేసుకునే దుస్థితికి కారణం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు కేటీఆర్. గతంలో రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్టు.. వేలాది మంది తెలంగాణ బిడ్డలను చంపినా బలి దేవత ఎవరు అంటూ తన ట్వీట్‌ను ముగించారు కేటీఆర్.