Telugu Global
Telangana

విద్యార్థులు చదువుల్లో గొప్పగా రాణించాలి : సీఎం రేవంత్‌

విద్యార్థులు చదువుల్లో రాణించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

విద్యార్థులు చదువుల్లో గొప్పగా రాణించాలి : సీఎం రేవంత్‌
X

విద్యార్థులు చదువుల్లో ఉన్నతంగా రాణించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ వ‌స‌తి గృహ విద్యార్థుల‌కు డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నేతత్వంలో పాఠశాల విద్యార్థులు హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి నివాసానికి తరలివచ్చారు. సీఎం వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి తీసుకున్న చర్యలను వివరించారు.

ప్రభుత్వ పాఠశాలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న నిర్ణయం, స్కిల్ యూనివర్సిటీ, ఐటీఐలను ఏటీసీలుగా మార్పు, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు వంటి పలు అంశాలను రేవంత్‌రెడ్డి వారితో పంచుకున్నారు. డ్రాపవుట్స్‌ను తగ్గించడానికి యువజన సంఘాలు చొరవ చూపాలని, గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాల బారిన పడొద్దని విద్యార్థులను సీఎం కోరారు. రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలను నమ్మొద్దని, విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్దం కావాలని హితవు చెప్పారు. అలాగే విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నమని సీఎం అన్నారు.

First Published:  4 Nov 2024 9:46 PM IST
Next Story