ఉస్మానియాలో విద్యార్థి సంఘాల ఆందోళన..హైటెన్షన్
ఓయూలో ఉద్రిక్తత పరిస్దితి నెలకొంది. నిరసనలు నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని విద్యార్థు సంఘూలు నిరసన చేపట్టాయి.
BY Vamshi Kotas17 March 2025 5:20 PM IST

X
Vamshi Kotas Updated On: 17 March 2025 5:20 PM IST
ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. నిరసనలు నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. వైస్ ఛాన్సలర్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విద్యార్థి సంఘాల సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఓయూ అధికారులు జారీ చేసిన సర్క్యులర్‌పై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి.
ప్రశ్నించే గొంతును నొక్కే ప్రయత్నమే ఈ సర్క్యులర్ అని ఆరోపించాయి. వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు విద్యార్థి సంఘాల జేఏసీ నేతలు సర్క్యులర్ ప్రతులను తగులబెట్టారు. వర్సిటీ అధికారుల నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా మరో ఉద్యమానికి కార్యాచరణను రూపొందించారు.
Next Story