Telugu Global
Telangana

పోరాటం మాకు కొత్త కాదు.. రేవంత్‌ సర్కార్‌కు కేటీఆర్ వార్నింగ్

అసెంబ్లీలో జాబ్‌ క్యాలెండర్ ప్ర‌క‌టించిన ప్రభుత్వం.. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితమైంది.

పోరాటం మాకు కొత్త కాదు.. రేవంత్‌ సర్కార్‌కు కేటీఆర్ వార్నింగ్
X

కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీలో శుక్రవారం రేవంత్ సర్కార్‌ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి.. జాబ్‌ క్యాలెండర్‌లో మాత్రం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారనే లెక్కలు చెప్పలేదని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఇదే అంశంపై కేటీఆర్ తాజాగా ట్వీట్ చేశారు.

కేటీఆర్ ట్వీట్ ఇదే..

పోరాటం తమ పార్టీకి కొత్త కాదన్నారు కేటీఆర్. ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని నమ్మించి రాహుల్ గాంధీ తెలంగాణ యువతను మోసం చేస్తున్నారన్నారు. అవసరమైతే ఢిల్లీకి వచ్చి రాహుల్‌గాంధీని, కాంగ్రెస్ నేతల తీరును ఎండగడతామన్నారు. ఎన్ని బూతులు తిట్టినా, అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తామన్నారు కేటీఆర్.


శుక్రవారం అసెంబ్లీలో జాబ్‌ క్యాలెండర్ ప్ర‌క‌టించిన ప్రభుత్వం.. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితమైంది. ఈ అంశంపై ఎలాంటి చర్చకు అనుమతించలేదు. మాట్లాడేందుకు ప్రతిపక్ష సభ్యులకు అవకాశం ఇవ్వలేదు. దీనిపై బీఆర్ఎస్ నేతలు గన్‌పార్క్‌ దగ్గర నిరసన తెలిపారు. ఎన్నికల టైమ్‌లో అశోక్‌నగర్‌కు వచ్చిన రాహుల్‌గాంధీ.. ఇప్పుడు అశోక్‌నగర్‌కు రావాలని బీఆర్ఎస్‌ నేతలు సవాల్‌ విసిరారు. నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్టు చేసి తెలంగాణ భవన్‌కు తరలించారు పోలీసులు.

First Published:  3 Aug 2024 6:44 AM GMT
Next Story