Telugu Global
Telangana

బీజేపీలో సంకుల సమరం...రఘునందన్ కు వ్యతిరేకంగా సీనియర్లు రహస్య భేటీ

దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన రావుకు, ఆ నియోజక వర్గంలో మొదటి నుంచి బీజేపీలో ఉన్న సీనియర్లకు చాలాకాలంగా పడటం లేదట. తాజాగా దుబ్బాక నియోజకవర్గంలో సీనియర్ బీజెపి నాయకులంతా చేగుంటలో రహస్య సమావేశం నిర్వహించారు.

బీజేపీలో సంకుల సమరం...రఘునందన్ కు వ్యతిరేకంగా సీనియర్లు రహస్య భేటీ
X

తెలంగాణ బీజేపీలో ఇప్పటికే మూడు వర్గాలుగా రాజకీయాలునడుస్తున్నాయి. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రెండు వర్గాలుగా ఉండగా పార్టీలో కొత్తగా చేరిన ఈటల మరో వర్గంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా తాను సపరేట్ గా ఓ వర్గం మేంటేన్ చేస్తున్నాడని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇప్పుడు ఆయన నియోజకవర్గంలోనే ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలయ్యింది.

దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన రావుకు, ఆ నియోజక వర్గంలో మొదటి నుంచి బీజేపీలో ఉన్న సీనియర్లకు చాలాకాలంగా పడటం లేదట. తాజాగా దుబ్బాక నియోజకవర్గంలో సీనియర్ బీజెపి నాయకులంతా చేగుంటలో రహస్య సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో పాల్గొన్న నేతలంతా రఘునందన్ రావుపై ఆరోపణలు గుప్పించారు. బీజేపీలో మొదటి నుంచి ఉన్న వారిని

ఎమ్మెల్యే పట్టిం చుకోవడం లేదని, అందరినీ కలుపుకొని ముందుకు సాగడం లేదని.ఆయన బీఆరెస్ కు ఏజెంటుగా పని చేస్తున్నారని ఆనాయకులు ధ్వజమెత్తారు. రఘునందన్ ను కట్టడి చేయాలని వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికట్ రాకుండా చేయాలని ఆనేతలు నిర్ణయం తీసుకున్నారట. ఈ

నెలాఖరును మరోసారి సమావేశమై భవిష్య త్‌ కార్యాచరణ ప్రకటించాలని చేగుంట భేటీలో నిర్ణయిం చారట.

అయితే రఘునందన్ రావు తనకు వ్యతిరేకంగా సమావేశమైన నేతలపై ఆగ్రహంగా ఉన్నారు. సీనియర్లుగా చెప్పుకుంటున్న వారందరు దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్ రావుకు వ్యతిరేకంగా ప్రచారం చేశారని, బీఆరెస్ లాభపడే విధంగా పనిచేశారని, అందుకే వారిని రఘునందన్ రావు దూరం పెట్టారని ఆయన అనుచరులు చెప్తున్నారు. ఈ సీనియర్ నేతల రహస్య సమావేశాన్ని రఘునందన్ రావు సీరియస్ గా తీసుకుంటున్నారట. ఆ నాయకులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారట.

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికి వచ్చిన తరుణంలో ఇలా ఎమ్మెల్యేపై అసమ్మతి స్వరాలు వినిపించడం పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారిందట. ఒక వైపు మొదటి నుంచీ బీజేపీ లో ఉన్న నాయకులు, మరో వైపు ఈ మధ్యనే గెల్చిన ఎమ్మెల్యే... వీరిద్దరి మధ్య సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక అధినాయకత్వం సతమతమవుతోందట.

First Published:  6 Jan 2023 11:34 AM IST
Next Story