Telugu Global
Telangana

ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే క‌ఠిన చ‌ర్యలు : స‌జ్జన‌ర్

టీజీఎస్‌ ఆర్టీసీ సిబ్బందిపై దాడుల‌కు పాల్పడితే క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జన‌ర్ హెచ్చరించారు.

ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే క‌ఠిన చ‌ర్యలు :  స‌జ్జన‌ర్
X

ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జన‌ర్ హెచ్చరించారు. నిందితుల‌పై పోలీస్ శాఖ స‌హ‌కారంతో రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని తెలిపారు. దుండగుల చేతిలో దాడికి గురై తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుషాయిగూడ డిపో డ్రైవ‌ర్ దార‌వ‌త్ గ‌ణేశ్‌‌ను స‌జ్జన‌ర్ శ‌నివారం ప‌రామ‌ర్శించారు. ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును ఆయ‌న‌ను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ డ్రైవర్‌కు ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు డ్రైవ‌ర్‌కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.

అప్జల్ గంజ్ నుంచి ఘ‌ట్‌కేస‌ర్‌కు వెళ్తున్న రూట్ నంబ‌ర్ 231/1 మెట్రో ఎక్స్ ప్రెస్ బ‌స్సులో విధులు నిర్వర్తిస్తోన్న డ్రైవ‌ర్ గ‌ణేశ్‌పై ఉస్మానియా యూనివ‌ర్శిటీ వై జంక్షన్ వ‌ద్ద దుండ‌గులు విచ‌క్షణ‌ర‌హితంగా దాడి చేశారు. ఎలాంటి తప్పు లేకున్నా బస్సును రోడ్డుపై ఆపి సీటులో కూర్చున్న డ్రైవర్‌ను అస‌భ్యప‌ద‌జాలంతో దూషిస్తూ ఆరుగురు తీవ్రంగా కొట్టారు. డ్రైవర్ గ‌ణేష్ కు తీవ్ర గాయ‌ల‌వ‌డంతో డ్రైవ‌ర్ అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిపోయారు. వెంట‌నే ఆయ‌న‌ను తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి త‌ర‌లించారు. దాడికి పాల్పడ్డ ఐదుగురు దుండ‌గుల‌ను శ‌నివారం అరెస్ట్ చేశారని ఆయన తెలిపారు.

First Published:  21 Sept 2024 3:41 PM GMT
Next Story