ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు గ్రూప్స్ ఫలితాలు నిలిపివేయండి : కృష్ణ మాదిగ
సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ లేఖ రాశారు.

ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని రకాల ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. గతంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకూ వర్తింపుజేస్తామని చెప్పారని కృష్ణ మాదిగ పేర్కొన్నారు.ఈ నెల 12 నుంచి జరిగే శాసన సభ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ కోసం చట్టం చేస్తామని చెప్పి మరోవైపు గ్రూప్స్ ఫలితాల వెల్లడి తేదీలను ప్రకటించడం సరైంది కాదన్నారు. దీంతో ఎస్సీలకు మరోసారి అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్సీ ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని, ఆగస్టు 1న అత్యున్నత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అదే రోజు నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్వాగతించారని గుర్తుకు చేశారు. అందరికంటే ముందుగా దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని ప్రకటన చేశారని, గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగ నియామకాలు చేస్తామని స్పష్టమైన ప్రకటన అసెంబ్లీలో చేశారని అన్నారు .కానీ, ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున అందులో చట్టం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున అందులో చట్టం చేస్తామని హామీ ఇచ్చారు.. మళ్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్ష ఫలితాలు రిలీజ్ చేస్తామని టీజీపీఎస్సీ పత్రిక ప్రకటన చేయించిన తర్వాత మాదిగ జాతి ప్రజలు మరోసారి మోసానికి గురవుతున్నారని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఒకవేళ అదే జరిగితే మేము మరింత నష్టపోయే ప్రమాదం ఉందన్నారు