సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్ ప్రెస్ పై మూడోసారి రాళ్ల దాడి
గతనెలలో ప్రారంభమైన సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై ఇప్పటికే రెండుసార్లు రాళ్ళదాడి జరగగా తాజాగా మరో సారి రాళ్ళ దాడి జరిగింది.
మనదేశంలో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ళు ప్రారంభమైనప్పటినుంచి వాటిపై ఎక్కడొ ఓ చోట రాళ్ళ దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాగుబోతులు, పోకిరీల వంటి వాళ్ళు ఊరికేనే ఈ రాళ్ళదాడికి పాల్పడుతున్నారు.
గతనెలలో ప్రారంభమైన సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై ఇప్పటికే రెండుసార్లు రాళ్ళదాడి జరగగా తాజాగా మరో సారి రాళ్ళ దాడి జరిగింది. వందేభారత్ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళుతుండగా మహబూబాబాద్-గార్ల స్టేషన్ల మధ్య నేడు ఈ రైలు పై ఓ వ్యక్తి రాయి విసిరాడు. దాంతో ఓ బోగీ (సీ-8 కోచ్) అద్దం ధ్వంసమైంది. అయితే ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు.
కాగా, రైలు ప్రారంభానికి ముందే విశాఖపట్నంలో ఈ రైలుపై రాళ్ల దాడి జరగి, కొన్ని బోగీల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఇటీవల మరోసారి ఖమ్మం జిల్లాలో రాళ్ల దాడి జరగింది. ఆదాడిలో ఎమర్జెన్సీ విండో దెబ్బతింది. దాంతో రైలు మూడు గంటలు ఆలస్యంగా సికింద్రాబాద్ చేరుకుంది.
ఈ రోజు రైలుపై రాయి విసిరిన వ్యక్తిని పట్టుకునేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగింది.