కలసిన చేతులు.. ఘన్ పూర్ లో ఘన విజయం ఖాయమేనా..?
ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఇరు వర్గాలను ఒకేచోటకు చేర్చారు మంత్రి హరీష్ రావు. ఈ సమావేశం తర్వాత కడియంలో గెలుపు ధీమా పెరిగింది. రాజయ్య పూర్తిగా మెత్తబడ్డారని తెలుస్తోంది.
స్టేషన్ ఘన్ పూర్ లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వర్గం, ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి వర్గం నేతలు.. ఈ సమావేశానికి హాజరయ్యారు. మంత్రి హరీష్ రావు ఇరు వర్గాలను ఒక దగ్గరకు చేర్చి సమావేశం ఏర్పాటు చేశారు. అందరూ కలసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పొరపాటున కూడా కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వొద్దని, రైతులు తమ జీవితాలను అంధకారం చేసుకోవద్దని చెప్పారు.
Live: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీ @BRSHarish #KCROnceAgain #VoteForCar https://t.co/2Ib2Vii2Kb
— BRS Party (@BRSparty) October 28, 2023
తనకు భేషజాలు లేవన్న కడియం శ్రీహరి.. రాజయ్య సహాయంతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాజయ్యను ఏమీ మనసులో పెట్టుకోవద్దని కోరారు. భవిష్యత్ లో ఆయనకు మంచి పదవి వస్తుందని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు కడియం శ్రీహరి. జోడెద్దుల లాగా కష్టపడి పనిచేసి బీఆర్ఎస్ ని గెలిపిద్దామని, కేసీఆర్ ని సీఎం చేసుకుందామని చెప్పారు. నియోజకవర్గానికి 6 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయిస్తానని చెప్పారు కడియం. 2100 దళిత బంధు యూనిట్లు వచ్చేలా చేస్తానన్నారు.
స్టేషన్ ఘన్ పూర్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు సీటు దక్కకపోవడంతో.. అక్కడ గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. అయితే ఎప్పటికప్పుడు రాజయ్య, కడియం వర్గాలను కలిపేందుకు మంత్రి కేటీఆర్, హరీష్ రావు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇద్దరినీ పలు దఫాలు ఒకే దగ్గర చేర్చారు. తాజాగా.. మరోసారి ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఇరు వర్గాలను ఒకేచోటకు చేర్చారు మంత్రి హరీష్ రావు. ఈ సమావేశం తర్వాత కడియంలో గెలుపు ధీమా పెరిగింది. రాజయ్య పూర్తిగా మెత్తబడ్డారని తెలుస్తోంది. ఘన్ పూర్ లో బీఆర్ఎస్ కు ఘన విజయం ఖాయమని అంటున్నారు ఇరు వర్గాల నేతలు.