Telugu Global
Telangana

తెలంగాణ: పల్లె పల్లెనా క్రీడా స్థలం..... కేంద్రమంత్రి ప్రశంసలు

తెలంగాణలో జరుగుతున్న క్రీడల అభివృద్దిని కేంద్ర క్రీడా శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశంసించారు. తెలంగాణ క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్రమంత్రిని ఈ రోజు అహ్మదాబాద్ లో కలిశారు.

తెలంగాణ: పల్లె పల్లెనా క్రీడా స్థలం..... కేంద్రమంత్రి ప్రశంసలు
X

తెలంగాణ క్రీడా శాఖా మంత్రి శ్రీనివాస గౌడ్ కేంద్ర స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ తో సమావేశమయ్యారు. ఈ రోజు అహ్మదా బాద్ లో ప్రారంభం కానున్న జాతీయ క్రీడలకు శ్రీనివాస గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుతో కలిసి శ్రీనివాస్ గౌడ్ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తో సమావేశమయ్యారు.

తెలంగాణలో ప్రతి పల్లె లో క్రీడా స్థలాలు, ప్రతి మున్సిపాలిటీలో అన్ని వసతులతో కూడిన అతి పెద్ద క్రీడా ప్రాంగణాలు నిర్మిస్తున్నట్టు, చాలా వరకు ఇప్పటికే ప్రాంగణాల నిర్మాణం పూర్త‌య్యిందని శ్రీనివాస్ గౌడ్ కేంద్ర మంత్రికి తెలిపారు. క్రీడాభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయనకు వివరించారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా క్రీడా పాలసీని అమలు చేస్తున్నామని ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామని, ప్రతి నియోజకవర్గంలో స్టేడియాలు నిర్మిస్తున్నామని వివరించారు. కామన్వెల్త్ గేమ్స్ లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని శ్రీనివాస్ గౌడ్ కేంద్ర మంత్రికి వివరించారు.

తెలంగాణలో జరుగుతున్న క్రీడాభివృద్ది, పల్లె పల్లెనా క్రీడా స్థలం కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశంసించారు. అసలు పల్లె పల్లెనా క్రీడా స్థలం ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోయారు కేంద్ర మంత్రి.

First Published:  30 Sept 2022 12:24 PM IST
Next Story