Telugu Global
Telangana

ప్రజావాణిలో గల్ఫ్‌ బాధితుల కోసం ప్రత్యేక కౌంటర్‌

నేడు ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌

ప్రజావాణిలో గల్ఫ్‌ బాధితుల కోసం ప్రత్యేక కౌంటర్‌
X

గల్ఫ్‌ బాధితులు, ఎన్‌ఆర్‌ఐలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి ప్రజావాణిలో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్‌ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో గల్ఫ్‌ బాధితులు, ఎన్‌ఆర్‌ఐల కోసం ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. బుధవారం నిర్వహించిన ప్రవాసి ప్రజావాణికి మంచి స్పందన లభించిందని, ఈ నేపథ్యంలోనే ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కౌంటర్‌ ను తాను ప్రారంభిస్తానని వెల్లడించారు. పీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ నాయకులు, గల్ఫ్‌ కార్మిక కుటుంబాలు, గల్ఫ్‌ సంఘాల నాయకులు ఈ ప్రత్యేక కౌంటర్‌ ను ఉపయోగించుకోవాలని సూచించారు.

First Published:  26 Sept 2024 5:52 PM IST
Next Story