Telugu Global
Telangana

సోనియా తీర్మానాలు.. తెలంగాణకు ఆరు గ్యారెంటీలు

సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణకు ఎంతో శుభదినమని, నిజాం పాలన నుంచి విముక్తి పొందిన రోజని చెప్పారు సోనియా గాంధీ. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలనేది తన కల అని ఆ కల నేరవేర్చాలని ఆమె ప్రజలను కోరారు.

సోనియా తీర్మానాలు.. తెలంగాణకు ఆరు గ్యారెంటీలు
X

హైదరాబాద్ తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్న సోనియా గాంధీ ఆరు తీర్మానాలు ప్రకటించారు. కర్నాటకలో కాంగ్రెస్ కి విజయాన్నందించిన పథకాలను ఇక్కడ కూడా ప్రవేశపెడతామని చెప్పారు. ఆమె ప్రసంగాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుగులోకి అనువదించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.. ఖర్గే, రాహుల్ గాంధీ సహా సీడబ్ల్యూసీ మీటింగ్ కోసం వచ్చిన కేంద్ర నాయకులు కూడా ఈ విజయభేరి సభలో పాల్గొన్నారు.


ఆరు తీర్మానాలు..

1. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం

2. పేద మహిళలకు రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌

3. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

4. రైతు భరోసా కింద ఏటా రైతుకు రూ.15 వేలు ఆర్థిక సాయం.. కౌలు రైతులకు కూడా వర్తింపు

5. భూమి లేని నిరుపేదలు, కూలీలకు ఏటా రూ.12 వేలు

6. వరి పండించే రైతులకు మద్దతు ధరతో పాటు క్వింటాల్‌ కు రూ.500 బోనస్‌

వీటితోపాటు.. ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు ఆర్థిక సాయం చేస్తామని కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు 250 చదరపు గజాల స్థలం కేటాయిస్తామని చెప్పారు. గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, యువ వికాసం ద్వారా విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు, మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్, చేయూత పింఛన్ నెలకు రూ. 4వేలకు పెంపు, రూ. 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా వర్తింపజేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.

సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణకు ఎంతో శుభదినమని, నిజాం పాలన నుంచి విముక్తి పొందిన రోజని చెప్పారు సోనియా గాంధీ. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలనేది తన కల అని ఆ కల నేరవేర్చాలని ఆమె ప్రజలను కోరారు.

First Published:  17 Sept 2023 7:17 PM IST
Next Story