Telugu Global
Telangana

తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు బంపర్ ఆఫర్..

ఇంటర్లో మ్యాథ్య్ ఓ సబ్జెక్ట్ గా ఉన్న విద్యార్థులకు సెకండ్ ఇయర్ లో ఆన్ లైన్ పరీక్ష నిర్వహిస్తారు. హెచ్.సి.ఎల్ కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (క్యాట్) ద్వారా క్యాంపస్ రిక్రూట్ మెంట్ చేపడతారు. ప్రతి ఏడాదీ 20వేలమందికి ఉద్యోగాలిస్తారు.

తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు బంపర్ ఆఫర్..
X

తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు బంపర్ ఆఫర్..

క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం కొట్టాలంటే కనీసం బీటెక్ చదువుతూ ఉండాలి, లేదా డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్ట్ గా అయినా ఉండాలి. అంతకంటే తక్కువ అర్హతలుంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగం కష్టం. కానీ తెలంగాణలో ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు కేసీఆర్ సర్కారు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. హెచ్.సి.ఎల్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు హెచ్.సి.ఎల్‌ టెక్నాలజీస్ సంస్థ క్యాంపస్ ఇంటర్వ్యూలు చేపడుతుంది. ప్రతి ఏడాది 20వేలమందికి సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగాలిస్తుంది.

ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల నిర్వాహకులు వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని క్యాంపస్ ప్లేస్ మెంట్లు చూపిస్తుంటారు. వాటితో ప్రచారం చేసుకుని అడ్మిషన్లు తెచ్చుకుంటారు. ఇదంతా ఓ ఒప్పందం ప్రకారం జరిగే పని. కానీ ప్రభుత్వ కాలేజీలవైపు సాఫ్ట్ వేర్ సంస్థలు పెద్దగా దృష్టిసారించవు. అందులోనూ ఇంటర్ విద్యార్హతతో కొలువులంటే చాలా కష్టం. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ చదివేవారిలో కొద్దిమంది మాత్రమే ఆ తర్వాత స్టడీస్ కొనసాగిస్తారు. టాలెంట్ ఉన్నా కూడా మిగతావాళ్లు కుటుంబ ఆర్థిక అవసరాల దృష్ట్యా పనులకు వెళ్తుంటారు. పేద విద్యార్థుల టాలెంట్ మరుగున పడిపోకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ సూచన చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆ సూచనను అమలులో పెట్టారు.

ఇంటర్లో మ్యాథ్య్ ఓ సబ్జెక్ట్ గా ఉన్న విద్యార్థులకు సెకండ్ ఇయర్ లో ఆన్ లైన్ పరీక్ష నిర్వహిస్తారు. హెచ్.సి.ఎల్ కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (క్యాట్) ద్వారా క్యాంపస్ రిక్రూట్ మెంట్ చేపడతారు. ప్రతి ఏడాదీ 20వేలమందికి ఉద్యోగాలిస్తారు. 6 నెలలు ఆన్ లైన్ ట్రైనింగ్, ఆ తర్వాత ఆరు నెలలపాటు ఇంటర్న్ షిప్ ఉంటుంది. ఆ తర్వాత ఏడాదికి 2.5 లక్షల ప్యాకేజీతో ఉద్యోగంలోకి తీసుకుంటారు.

ఉద్యోగంతోపాటు చదువు కూడా..

ఇంటర్ క్వాలిఫికేషన్ తో హెచ్.సి.ఎల్ లో ఉద్యోగంలో చేరితే ఉన్నత చదువులకు ఇబ్బంది ఉండదు. బిట్స్‌ పిలాని, శాస్త్ర, అమిటీ యూనివర్శిటీలతో హెచ్.సి.ఎల్ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆ సంస్థలో ఉద్యోగాలు చేస్తూనే ఆయా యూనివర్శిటీల్లో బీటెక్‌, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ కోర్సులు చేరొచ్చు. అటు ఉద్యోగం, ఇటు చదువు.. రెండిటినీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుకునే పేద విద్యార్థులకు ఇది నిజంగా ఓ వరం అని చెప్పాలి.

First Published:  30 Dec 2022 12:13 PM IST
Next Story