సోషియో ఎకనామిక్ ఔట్‌లుక్: తెలంగాణ GSDPలో 15.6 శాతం వృద్ధి నమోదు
2018-21 మధ్య కాలంలో, తెలంగాణ మొత్తం బడ్జెట్‌లో అభివృద్ధి వ్యయం వాటా 78.1 శాతంగా ఉంది, ఇదే కాలంలో భారతీయ రాష్ట్రాల సగటు అభివృద్ధి వ్యయం 68.4 శాతం గా ఉన్నది.
తెలంగాణ బలమైన ఆర్థిక వృద్ధిని సూచిస్తూ, ప్రస్తుత ధరల ప్రకారం 2022-23లో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) రూ.13.27 లక్షల కోట్లుగా ఉంది, ఇది 2021-22 సంవత్సరంతో పోలిస్తే 15.6 శాతం పెరుగుదలను నమోదు చేసింది.
2018-21 మధ్య కాలంలో, తెలంగాణ మొత్తం బడ్జెట్‌లో అభివృద్ధి వ్యయం వాటా 78.1 శాతంగా ఉంది, ఇదే కాలంలో భారతీయ రాష్ట్రాల సగటు అభివృద్ధి వ్యయం 68.4 శాతం గా ఉన్నది.
తెలంగాణలో ప్రస్తుత ధరల ప్రకారం తలసరి ఆదాయం (PCI) 2022-23లో రూ.3.17 లక్షలు, ఇది రూ. జాతీయ తలసరి ఆదాయం రూ.1.71 లక్షల కంటే 1.46 లక్షలు ఎక్కువ. ఆసక్తికరంగా, 2020-21లో దేశంలోని తలసరి ఆదాయం కంటే తెలంగాణలోని ప్రతి జిల్లా తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది.
2014-15 నుండి 2022-23 వరకు తెలంగాణ,భారతదేశంలోని ప్రస్తుత ధరల ప్రకారం, తలసరి ఆదాయం వార్షిక వృద్ధి రేటు (CAGR) ఆధారంగా, తెలంగాణలోని సగటు పౌరుడి ఆదాయం సుమారు 5 నుండి 6 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది. అయితే దేశం మొత్తం మీద సగటు పౌరుడి ఆదాయం రెట్టింపు కావాలంటే దాదాపు 8 నుండి 9 సంవత్సరాల వరకు వేచి ఉండవలసి ఉంటుంది.
సోమవారం విడుదల చేసిన 2022-23 సోషియో ఎకనామిక్ ఔట్‌లుక్ ప్రకారం, తెలంగాణ స్థూల రాష్ట్ర విలువ లో (GSVA) సేవల రంగం 62.8 శాతం వాటాను కలిగి ఉంది, తరువాత పరిశ్రమల రంగం 19 శాతం, 'వ్యవసాయం దాని అనుబంధ రంగాలు 18.2 శాతం కలిగి ఉన్నాయి.
వినూత్న పద్ధతులను అవలంబించడం, సాంకేతికత వినియోగం పెంచడం, రైతులకు ఆర్థిక చేయూత అందించడం ద్వారా తెలంగాణ వ్యవసాయ రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించింది.
అనేక కొత్త పరిశ్రమల స్థాపన, ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఇప్పటికే ఉన్నవాటిని విస్తరించడం ద్వారా పారిశ్రామిక రంగం కూడా రాష్ట్రంలో అద్భుతమైన వృద్ధిని సాధించింది. TS-iPASS విధానం వల్ల రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు తమ కార్యకలాపాలు ప్రారంభించడం సులభతరం అయ్యింది.