బీసీల సామాజిక, ఆర్థిక గణన మంచి పరిణామం
సీఎం రేవంత్ రెడ్డికి బీసీ నాయకుల కృతజ్ఞతలు
BY Naveen Kamera10 Oct 2024 1:51 PM IST

X
Naveen Kamera Updated On: 10 Oct 2024 1:51 PM IST
రాష్ట్రంలోని బీసీల సామాజిక, ఆర్థిక కుల గణన చేపట్టాలన్న నిర్ణయం మంచి పరిణామమని బీసీ సంఘాల నాయకులు తెలిపారు. బీసీ గణన తక్షణమే ప్రారంభించాలని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చారిత్రక నిర్ణయం తీసుకున్నారని బీసీ నాయకులు అన్నారు. సీఎంను కలిసిన వారిలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజల శ్రీనివాస్ గౌడ్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు తదితరులు ఉన్నారు.
Next Story