తెలంగాణ హైకోర్టుకి ఆరుగురు నూతన జడ్జిలు..
ఈరోజు జరిగిన కొలీజియం మీటింగ్ అనంతరం ఈ జాబితాను విడుదల చేశారు. వీరంతా త్వరలో తెలంగాణ హైకోర్టులో జడ్జిలుగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది.
BY Telugu Global25 July 2022 9:19 PM IST

X
Telugu Global Updated On: 25 July 2022 9:19 PM IST
తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు నూతన జడ్జిలను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. న్యాయవాదులకు హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు కొలీజియం ఆమోదముద్ర వేసింది.
కొలీజియం సిఫారసు చేసిన వారి జాబితా..
1. ఏనుగుల వెంకట వేణుగోపాల్
2. భీమపాక నగేష్
3. పుల్ల కార్తీక్
4. కాజా శరత్
5. జగ్గన్నగారి శ్రీనివాసరావు
6. నామవరపు రాజేశ్వరరావు
ఈరోజు జరిగిన కొలీజియం మీటింగ్ అనంతరం ఈ జాబితాను విడుదల చేశారు. వీరంతా త్వరలో తెలంగాణ హైకోర్టులో జడ్జిలుగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ న్యాయవాదులుగా ఉన్న వీరంతా న్యాయమూర్తులుగా కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఆరుగురు జడ్జిలకు తెలంగాణ న్యాయవాదుల సంఘం శుభాకాంక్షలు తెలిపింది.
Next Story