మహాలక్ష్మి పథకానికి పోటెత్తిన అప్లికేషన్లు..
జిల్లాల వారీగా చూస్తే ములుగు జిల్లాలో దరఖాస్తుల సంఖ్య అత్యల్పంగా ఉంది. అక్కడ అప్లికేషన్లు కనీసం లక్షకూాడా దాటలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువగా 18.97 లక్షల అప్లికేషన్లు అందాయి.
ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తుల్లో అత్యథికం మహాలక్ష్మి పథకం కోసమే కావడం విశేషం. 92.23 లక్షల మంది ఆ పథకం కోసం దరఖాస్తులు చేసుకున్నారు. గ్యాస్ సిలిండర్ రాయితీకోసం వచ్చిన దరఖాస్తులు రెండో స్థానంలో ఉన్నాయి. 91.49 లక్షలమంది రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం కోసం ప్రజా పాలనలో దరఖాస్తు చేశారు. తెలంగాణలో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు రాగా.. పథకాల వారీగా విభజిస్తే వాటి సంఖ్య 4,56,35,666 గా తేలింది. వాటి ఆన్ లైన్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
మహాలక్ష్మికి ఎందుకంత డిమాండ్..
ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో గ్యాస్ సిలిండర్ పథకం, మహిళలకు ఉచిత రవాణా పథకం అందర్నీ ఎక్కువగా ఆకర్షించినట్టు తెలిసింది. అందుకే అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత రవాణాని త్వరగా మొదలు పెట్టారు. ఆ తర్వాత నింపాదిగా మిగతా గ్యారెంటీలపై దృష్టిసారించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ప్రజలు గ్యాస్ సిలిండర్ పథకంతోపాటు.. మహాలక్ష్మి పథకంపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం చేయడమే మహాలక్ష్మి పథకం ఉద్దేశం. ఉద్యమ అమరుల కుటుంబాలకు ఇచ్చే ఇంటి స్థలాలకోసం కేవలం 23,794 దరఖాస్తులు వచ్చాయి. కౌలు రైతుల రైతు భరోసాకి 2.63 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
జిల్లాల వారీగా చూస్తే ములుగు జిల్లాలో దరఖాస్తుల సంఖ్య అత్యల్పంగా ఉంది. అక్కడ అప్లికేషన్లు కనీసం లక్షకూాడా దాటలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువగా 18.97 లక్షల అప్లికేషన్లు అందాయి. ఆన్ లైన్ ప్రక్రియ పూర్తయితే అప్లికేషన్ల స్క్రూటినీ ప్రక్రియ మొదలవుతుంది. దరఖాస్తు చేసుకున్నవారి వాస్తవ ఆర్థిక పరిస్థితిని నిర్థారించేందుకు ప్రభుత్వ సిబ్బందితో కూడిన టీమ్ ప్రతి ఇంటికీ వెళ్తుంది. ఆ తర్వాత లబ్ధిదారుల వడపోత పూర్తయితే పథకాల అమలు మొదలవుతుంది.