Telugu Global
Telangana

సిట్టింగ్ లకు సీట్లు.. లాజిక్ మిస్ అయిన కాంగ్రెస్

కాసేపు బీఆర్ఎస్ సంగతి పక్కనపెడదాం. పోనీ కాంగ్రెస్ లో ఎవరెవరికి ఎక్కడెక్కడ టికెట్లు లభిస్తాయనే విషయం కనీసం టీపీసీసీ అధ్యక్షుడికయినా తెలుసా..? అధిష్టానం సీల్డ్ కవర్ లో తమ నిర్ణయం పంపిస్తే దాన్ని కచ్చితంగా అమలుచేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిది.

సిట్టింగ్ లకు సీట్లు.. లాజిక్ మిస్ అయిన కాంగ్రెస్
X

ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఓ విచిత్రమైన డిమాండ్ వినపడుతోంది. దమ్ముంటే సిట్టింగ్ లకు సీట్లివ్వాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కు పదే పదే సవాల్ విసురుతున్నారు. తాజాగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు వంతపాడారు. షర్మిల, కాంగ్రెస్ లో చేరబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఇటీవల ఆమె కాంగ్రెస్ కి బాగానే కోరస్ వినిపిస్తున్నారు. దమ్ముంటే సిట్టింగ్ లకే సీఎం కేసీఆర్ సీట్లివ్వాలంటూ షర్మిల కూడా అదే డిమాండ్ వినిపిస్తున్నారు. అసలీ డిమాండ్ లో కాంగ్రెస్ లాజిక్ మిస్ అవుతుందనేది రాజకీయ విశ్లేషకుల మాట.

బీఆర్ఎస్ పార్టీ తరపున ఎవరికి టికెట్ కేటాయించాలి, ఏ నియోజకవర్గంలో ఎవరిని బరిలో దింపాలి, ఎవరిని ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంచాలి, ఎవరిని పరోక్ష పద్ధతుల్లో చట్టసభలకు పంపించాలనేది అధ్యక్షుడు కేసీఆర్ ఇష్టం. కేసీఆర్ బలంగా నమ్మిన వ్యక్తులకే టికెట్లు కేటాయిస్తారు. అది రాజకీయ వ్యూహం. ఆ వ్యూహాన్ని తమకు నచ్చినట్టు అమలు చేయాలని అడిగే హక్కు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఎక్కడిది..? దమ్ముంటే ఇచ్చి చూడండి మా సత్తా చూపిస్తామంటూ సవాళ్లు విసురుతున్నారు కాంగ్రెస్ నేతలు. సిట్టింగ్ లకే టికెట్లిస్తే వారు ఓడిపోతారని భావిస్తే.. అలాంటి నిర్ణయం సీఎం కేసీఆర్ ఎందుకు తీసుకుంటారు..? అసలు పక్కపార్టీలో ఎవరెవరికి టికెట్లివ్వాలి, ఎక్కడివ్వాలి అనే విషయం గురించి చర్చ తీసుకురావడమే కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్ గా భావించాలి.

కాంగ్రెస్ లో టికెట్లిచ్చే దమ్ముందా..?

కాసేపు బీఆర్ఎస్ సంగతి పక్కనపెడదాం. పోనీ కాంగ్రెస్ లో ఎవరెవరికి ఎక్కడెక్కడ టికెట్లు లభిస్తాయనే విషయం కనీసం టీపీసీసీ అధ్యక్షుడికయినా తెలుసా..? అధిష్టానం సీల్డ్ కవర్ లో తమ నిర్ణయం పంపిస్తే దాన్ని కచ్చితంగా అమలుచేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిది. ఇదే విషయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. బీఆర్ఎస్ సిట్టింగ్ లకు సీట్లిస్తుంది సరే, అసలు కాంగ్రెస్ నాయకుల సీట్లెక్కడో మీకు తెలుసా అంటూ సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు. బీఆర్ఎస్ వ్యూహాలను ప్రశ్నిస్తూ.. తమకు తామే పలుచన అవుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.

First Published:  23 July 2023 8:09 PM IST
Next Story