ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించడంపై అప్పీలుకు వెళ్ళనున్న 'సిట్'
హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు తుది కాపీ వచ్చేదాకా ఈ తీర్పును సస్పెన్షన్ లో ఉంచాలని, అమలు చేయవద్దని సిట్ తరపున వాదిస్తున్న అడ్వకేట్ జనరల్ న్యాయమూర్తిని కోరగా అందుకు న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు.
ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం కేసును సీబీఐ కి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్ళాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్ణయించింది.
మొయినాబాద్ ఫార్మ్ హౌజ్ లో బీఆరెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించి రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్ అనే ముగ్గురు నిందితులు అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతోంది. అయితే సిట్ పై తమకు నమ్మకం లేదని, ఈ కేసును సీబీఐ (CBI) తో విచారణ జరిపించాలని బీజేపీ (BJP) పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు సింగిల్ బెంచ్ బీజేపీ పక్ష వాదనలతో ఏకీభవించి కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్పు నిచ్చింది.
హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు తుది కాపీ వచ్చేదాకా ఈ తీర్పును సస్పెన్షన్ లో ఉంచాలని, అమలు చేయవద్దని సిట్ తరపున వాదిస్తున్న అడ్వకేట్ జనరల్ న్యాయమూర్తిని కోరగా అందుకు న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు.
హైకోర్టు ఆర్డర్ కాపీ అందాక తాము అప్పీలుకు వెళ్తామని అడ్వకేట్ జనరల్ ధర్మాసనానికి తెలిపారు. దాంతో అప్పీల్ కు వెళ్ళే అవకాశాన్ని ఇస్తామని న్యాయమూర్తి ఏజీకి తెలిపారు.