పేపర్ లీకేజి వ్యవహారంలో బండి సంజయ్ కి సిట్ నోటీసులు
ఈ నెల 24న తమ ఎదుట హాజరు కావాలని సిట్ సంజయ్ ని ఆదేశించింది. టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ అంశంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని సిట్ బండి సంజయ్ ని కోరింది.
BY Telugu Global21 March 2023 7:39 PM IST
X
Telugu Global Updated On: 21 March 2023 7:39 PM IST
TSPSCపేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ జోరు పెంచింది. ఒక వైపు నిందితుల నుండి సమాచారాన్ని సేకరించడానికి వారిని విచారిస్తున్న సిట్, మరో వైపు మరింత సమాచారం కోసం ఇతరులకు కూడా నోటీసులు ఇస్తున్నారు.
పేపేర్ లీకేజీ వ్యవహారం పై విమర్శలు చేయడమే కాకుండా పలువురు వ్యక్తులపై ఆరోపణలు చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన వద్ద ఉన్న ఆధారాలను తమకు ఇవ్వాలని సిట్ నిన్న నోటీసులు జారీ చేశారు. అదే విధంగా ఈ రోజు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి నోటీసులు జారీ చేశారు.
ఈ నెల 24న తమ ఎదుట హాజరు కావాలని సిట్ సంజయ్ ని ఆదేశించింది. టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ అంశంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని సిట్ బండి సంజయ్ ని కోరింది. గ్రూప్ 1 ఎగ్జామ్ లో ఒకే ఊరిలో ఎక్కువమందికి 100 మార్కులు వచ్చాయని బండి సంజయ్ ఆరోపించారు. ఆ ఆరోపణల కు ఆధారాలు ఇవ్వాలని సిట్ కోరింది.
Next Story