Telugu Global
Telangana

రూ.350 కోట్లతో తెలంగాణలో సింటెక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్

సింటెక్స్ బ్రాండ్ పేరుతో ఈ తయారీ యూనిట్‌లో వాటర్ ట్యాంకులు, పైపులు, ఆటో కాంపోనెంట్, ఆన్సిలరీస్ ఉత్పత్తి చేయనున్నారు.

రూ.350 కోట్లతో తెలంగాణలో సింటెక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్
X

తెలంగాణలో మరో పెద్ద సంస్థ తయారీ యూనిట్‌ను నెలకొల్పడానికి ముందుకు వచ్చింది. వాటర్ ట్యాంకులు అనగానే అందరికీ గుర్తుకు వచ్చే 'సింటెక్స్' కంపెనీ తెలంగాణలో భారీ తయారీ యూనిట్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. రూ.350 కోట్లతో ఈ మాన్యుఫ్యాక్ఛరింగ్ యూనిట్‌ను నెలకొల్పుతున్నట్లు ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.

సింటెక్స్ బ్రాండ్ పేరుతో ఈ తయారీ యూనిట్‌లో వాటర్ ట్యాంకులు, పైపులు, ఆటో కాంపోనెంట్, ఆన్సిలరీస్ ఉత్పత్తి చేయనున్నారు. రూ.350 కోట్ల పెట్టబడితో నిర్మించనున్న ఈ తయారీ యూనిట్‌ ద్వారా 1000 మందికి ఉద్యోగాలు వస్తాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. కాగా, ఈ తయారీ యూనిట్‌కు ఈ నెల 28న మంత్రి కేటీఆర్ భూమి పూజ చేయనున్నారు.

దేశంలో వాటర్ ట్యాంకులు, పైపుల తయారీలో సింటెక్స్ బ్రాండ్ అందరికీ సుపరిచితం. ఈ ఏడాదే సింటెక్స్ కంపెనీని వెల్‌స్పన్ సంస్థ కొనుగోలు చేసింది. వెల్‌స్పన్ సంస్థ ఇప్పటికే తెలంగాణలో రూ.2000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. తెలంగాణలో మొత్తం రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెడతామని ఇప్పటికే వెల్‌స్పన్ హామీ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లాలోని చందన్‌వల్లిలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వెల్‌స్పన్ సంస్థ ఒక తయారీ యూనిట్ ప్రారంభించింది. అక్కడ ఫ్లోరింగ్ యూనిట్లను తయారు చేస్తోంది. తాజాగా సింటెక్స్ బ్రాండ్ ద్వారా రూ.350 కోట్ల పెట్టుబడితో తయారీ యూనిట్ నెలకొల్పనున్నది.


First Published:  23 Sept 2023 6:09 PM IST
Next Story