Telugu Global
Telangana

రేవంత్ బాధిత సంఘం.. సింగిరెడ్డి సంచలన నిర్ణయం.!

రేవంత్‌ డబ్బులకు టికెట్లు అమ్ముకున్నాడని రాష్ట్రమంతా కోడై కూస్తుందన్నారు సింగిరెడ్డి. దారి తప్పి రేవంత్‌ చేతికి అధికారం వస్తే రాష్ట్రాన్ని అమ్మేయడం ఖాయమన్నారు.

రేవంత్ బాధిత సంఘం.. సింగిరెడ్డి సంచలన నిర్ణయం.!
X

ఉప్పల్‌ కాంగ్రెస్‌ టికెట్ ఆశించి భంగపడిన సింగిరెడ్డి సోమశేఖర్‌ రెడ్డి సెన్సెషనల్ కామెంట్స్‌ చేశారు. రేవంత్‌ బాధిత సంఘం పెట్టబోతున్నట్లు ప్రకటించారు. రేవంత్‌ చేతిలో మోసపోయిన వాళ్లందరిని కలుపుకుని వెళ్లి ఆయన మోసాలను బయటపెడుతానన్నారు. రేవంత్‌ అందరిని వాడుకుని వదిలేసే రకమని, కాంగ్రెస్ నాయకులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. డబ్బులకు విలువిచ్చే రేవంత్ రెడ్డి నిజమైన కార్యకర్తలను కాంగ్రెస్‌లో ఉండనివ్వడన్నారు. రేవంత్‌ డబ్బులకు టికెట్లు అమ్ముకున్నాడని రాష్ట్రమంతా కోడై కూస్తుందన్నారు సింగిరెడ్డి. దారి తప్పి రేవంత్‌ చేతికి అధికారం వస్తే రాష్ట్రాన్ని అమ్మేయడం ఖాయమన్నారు.

కొడంగల్‌లోనూ రేవంత్‌కు వ్యతిరేకంగా 500 మందితో ప్రచారం చేస్తాన‌ని సింగిరెడ్డి చెప్పారు. రేవంతే టికెట్ రాకుండా అడ్డుకున్నాడని..ఓ వ్యక్తి ఢిల్లీ నుంచి ఫోన్ చేసి చెప్పాడన్నారు. సర్వేలో తనకు 38 శాతం, పరమేశ్వర రెడ్డికి 26 శాతం వచ్చిందని చెప్పారు. ఓడిపోయే వ్యక్తికి రేవంత్ టికెట్ ఇచ్చాడని అన్నారు. కాంగ్రెస్‌ గెలిచి రేవంత్‌కు సీఎం పదవి ద‌క్క‌క‌పోతే, కొంతమంది MLAతో ప్రాంతీయ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నాడని సింగిరెడ్డి ఆరోపించారు.

రేవంత్‌ రెడ్డిపై కసితో మంత్రి కేటీఆర్ సమక్షంలో రేపు బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు సింగిరెడ్డి. ఉప్పల్ నియోజకవర్గం టికెట్‌ను సోమశేఖర్‌ రెడ్డి ఆశించారు. రేవంత్‌కు మంచి ఫాలోవర్‌గా ఉన్న సోమశేఖర్‌ రెడ్డి టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఇప్పటికే ఉప్పల్‌ నియోజకవర్గానికి చెందిన రాగిడి లక్ష్మారెడ్డి టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పి బీఆర్ఎస్‌లో చేరిపోయారు. మరోవైపు బీఆర్ఎస్‌ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డిని కాదని..బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చింది.

First Published:  26 Oct 2023 4:00 PM IST
Next Story