Telugu Global
Telangana

అదితిరావు, సిద్ధార్థ్‌లు సీక్రెట్‌గా ఎందుకు పెళ్లి చేసుకున్నారంటే..

సిద్ధార్థ్‌, అదితి రావు హైదరి కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇటీవలి రోజుల్లో వీరిద్దరూ జంటగా ఫంక్షన్స్‌కి, సినిమాలకి, పార్టీలకి వెళ్లారు.

అదితిరావు, సిద్ధార్థ్‌లు సీక్రెట్‌గా ఎందుకు పెళ్లి చేసుకున్నారంటే..
X

తమిళ్ హీరో సిద్ధార్థ్‌ సీక్రెట్‌గా వివాహం చేసుకున్నాడు. హీరోయిన్ అదితి రావు హైదరితో సిద్ధార్థ్‌ ఏడడుగులు వేశాడు. సిద్ధార్థ్‌, అదితిల వివాహం వనపర్తిలోని శ్రీరంగపురం టెంపుల్‌లో ఇవాళ జరిగింది. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. తమిళనాడు పురోహితులు వివాహం జరిపించారు. వనపర్తి సంస్థానాధీశులు కట్టించిన ఆలయంలో ఆంక్షల మధ్య సిద్ధార్థ్‌, అదితి ఒక్కటయ్యారు.

సిద్ధార్థ్‌, అదితి రావు హైదరి కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇటీవలి రోజుల్లో వీరిద్దరూ జంటగా ఫంక్షన్స్‌కి, సినిమాలకి, పార్టీలకి వెళ్లారు. దాంతో పెళ్లి గురించి అడగ్గా.. ఇద్దరు దాటవేస్తూ వచ్చారు. చివరకు సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. సిద్ధార్థ్‌కి అధికారికంగా ఇది రెండో పెళ్లి కాగా.. అదితికి కూడా రెండో వివాహమే.

2003లో మేఘన అనే యువతిని సిద్ధార్థ్ వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో 2007లో విడిపోయాడు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అతడి బాధ్యతలను సిద్ధార్థ్ చూసుకుంటున్నాడు. అప్పటినుంచి మరో వివాహం చేసుకోలేదు గానీ.. చాలా మంది హీరోయిన్స్‌తో ఎఫైర్ నడిపాడు. సోహా అలీ ఖాన్, సమంత కూడా ఆ జాబితాలో ఉన్నారు. చివరకు అదితిని వివాహం చేసుకున్నాడు. సిద్దార్థ్-అదితి కలిసి మహాసముద్రం సినిమాలో నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు.

First Published:  27 March 2024 3:13 PM IST
Next Story