Telugu Global
Telangana

సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్‌ఐ ఆత్మహత్య

ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాజేడు ఎస్‌ఐ హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడు.

సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్‌ఐ ఆత్మహత్య
X

ములుగు జిల్లా వాజేడు ఎస్‌ఐ హరీశ్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్స్‌లో తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వ్యక్తిగత కారణాలతో సుసైడ్ పాల్పడినట్లు తెలుస్తున్నది. అయితే ఏటూరునాగారంలో ఎన్‌కౌంటర్‌ జరిగిన రాత్రే ఆయన సూసైడ్‌ చేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నత అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఏటూరునాగారం మండలం చెల్పాక-ఐలాపూర్‌ అటవీ ప్రాంతంలో నిన్న భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఇరువర్గాల మధ్య హోరాహోరీగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఇందులో ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నారు. రెండు ఏకే 47 తుపాకులతోపాటు మరో ఐదు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ఆరుగురు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారు కాగా, తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాణాపూర్‌ గ్రామానికి చెందిన ఏగోలపు మల్లయ్య ఉన్నారు.

First Published:  2 Dec 2024 10:03 AM IST
Next Story