Telugu Global
Telangana

హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్.. ఈ వేసవిని తట్టుకోలేరు

ఫిబ్రవరి 23న హైదరాబాద్ లో 36 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత 24, 25, 26 తేదీల్లో కూడా అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపారు.

హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్.. ఈ వేసవిని తట్టుకోలేరు
X

తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఓవైపు చలి చంపేస్తోంది, మరోవైపు ఎండ వేడిమి కూడా పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నట్టు ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్ మెంట్ (IMD) తెలిపింది. సహజంగా ఫిబ్రవరిలో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీలుగా ఉంటుంది. కానీ ఈ ఏడాది 36 డిగ్రీలు నమోదు కాబోతున్నట్టు IMD తెలిపింది. ఫిబ్రవరి 23న హైదరాబాద్ లో 36 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత 24, 25, 26 తేదీల్లో కూడా అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపారు.

ఇప్పటికే మహబూబ్ నగర్ లో 35 డిగ్రీల అత్యథిక ఉష్ణోగ్రత నమోదైంది, ఇప్పుడిక హైదరాబాద్ వంతు వచ్చింది. హైదరాబాద్ లో మార్చి, ఏప్రిల్, మే నెలల్ల కూడా ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని IMD అంచనా వేస్తోంది. ఈ వేసవి మొత్తం హైదరాబాద్ వాసులకు ఉక్కపోత తప్పదని, వేడిగాలులతో ప్రజలు ఇబ్బంది పడే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది.

ఎల్ నినో ప్రభావం..

ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది నుంచి ఎల్ నినో ప్రభావం మొదలవుతుందనే అంచనాలున్నాయి. ఇటీవల లా నినా ప్రభావంతో వర్షాలు, తుఫానులతో ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదయ్యాయి. కానీ ఈ ఏడాది నుంచి ఎల్ నినో ప్రభావం ఉంటుందని దీనివల్ల ఉష్ణోగ్రతల్లో భారీ పెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇక తెలంగాణ విషయానికొస్తే హైదరాబాద్ లో అత్యథిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి మూడోవారంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఇక ఏప్రిల్, మే లో ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

First Published:  20 Feb 2023 3:30 PM IST
Next Story