రైతులకు షాకింగ్ న్యూస్.. ఆ 5 రోజులు..
తెలంగాణలో వచ్చే 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. అకాల వర్షాలతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో వానలు పడటంతో నష్టపోతున్నారు. ఈ సమయంలో తెలుగురాష్ట్రాలకు పిడుగులాంటి వార్త చెప్పింది వాతావరణశాఖ. మరో 5 రోజులు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
తెలంగాణలో వచ్చే 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఏపీలోనూ రాబోయే ఐదురోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.