మహిళలకు షాక్ ఇచ్చిన రేవంత్.. ఆ పథకం రద్దు
కేసీఆర్ హయంలో వచ్చిన గృహలక్ష్మి పథకం ఉద్దేశం కూడా ఇదే. అయితే గత ప్రభుత్వం గృహలక్ష్మి కింద రూ. 3లక్షల సాయం మాత్రమే చేసింది. రేవంత్ సర్కారు దాన్ని మరో రూ. 2లక్షలకు పెంచి 5లక్షలు చేసింది.
రేవంత్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. గృహలక్ష్మి పథకం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసీఆర్ హయంలో జిల్లా కలెక్టర్లు లబ్ధిదారులకు ఇచ్చిన మంజూరు పత్రాలను సైతం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాత లబ్ధిదారులకు షాక్ తగిలినట్లయింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలో భాగంగా గృహలక్ష్మి స్థానంలో అభయ హస్తాన్ని అమలు చేస్తామని రేవంత్ సర్కారు తెలిపింది. ఈ పథకం కింద సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ. 5లక్షల సాయం ఇవ్వనున్నారు.
కేసీఆర్ హయంలో వచ్చిన గృహలక్ష్మి పథకం ఉద్దేశం కూడా ఇదే. అయితే గత ప్రభుత్వం గృహలక్ష్మి కింద రూ. 3లక్షల సాయం మాత్రమే చేసింది. రేవంత్ సర్కారు దాన్ని మరో రూ. 2లక్షలకు పెంచి 5లక్షలు చేసింది. గృహలక్ష్మితో పోలిస్తే అభయహస్తంలో అదనంగా 2లక్షల సాయం అందుతుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఇందులోనే అసలు ట్విస్ట్ ఉంది. కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నికల ముందునాటికి 15లక్షల మంది గృహలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 2లక్షల మంది లబ్ధిదారులకు పత్రాలు కూడా మంజూరు చేశారు. ఆ 2లక్షల మందికి ఇప్పుడు సాయం రాదు. వాళ్లకు మంజూరైన పత్రాలన్నీ రద్దయిపోతాయి. వాళ్లు కూడా మళ్లీ ఆర్థికసాయం కోసం అభయహస్తం కింద కొత్తగా అప్లయ్ చేసుకోవాల్సిందే. వాళ్లు అర్హులని కొత్త ప్రభుత్వం నిర్ధారిస్తేనే అభయహస్తం కింద సాయం అందుతుంది.