నిర్మల్‌లో కమలం పార్టీకి షాక్..బీఆర్‌ఎస్‌లో చేరిన పీవీ మహేశ్ రెడ్డి
తెలంగాణలోని నిర్మల్ జిల్లా కమలం పార్టీకి భారీ షాక్ తగిలింది.
BY Vamshi Kotas2 Jan 2025 4:46 PM IST
X
Vamshi Kotas Updated On: 2 Jan 2025 4:46 PM IST
తెలంగాణలోని నిర్మల్ జిల్లా కమలం పార్టీకి భారీ షాక్ తగిలింది. నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నేత పీవీ మహేశ్ రెడ్డి బీజేపీకి గుడ్‌బై చెప్పి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువాను కప్పుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆయనకు పార్టీ కండువాను కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా మహేశ్ రెడ్డి మాట్లాడుతూ... నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.
Next Story