Telugu Global
Telangana

ప్రభాస్‌తో రిలేషన్‌పై షర్మిల షాకింగ్ కామెంట్స్

ప్రముఖ సినీహీరో ప్రభాస్‌తో రిలేషన్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రభాస్‌తో రిలేషన్‌పై షర్మిల షాకింగ్ కామెంట్స్
X

రెబల్ స్టార్ ప్రభాస్‌తో రిలేషన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడారు. హీరో ప్రభాస్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని షర్మిల స్పష్టం చేశారు.నేనెప్పుడూ ప్రభాస్‌ను చూడలేదు. నా పిల్లల మీద ప్రమాణం చేసి అప్పుడు చెప్పా.. ఇప్పుడు చెబుతున్నా’ అని వైఎస్ షర్మిల అన్నారు. జగన్‌కు తనపై ప్రేమ ఉంటే ఇలాంటి ప్రచారం జరుగుతున్నప్పుడు ఏం చేశారు అని షర్మిల ప్రశ్నించారు. ప్రభాస్‌కు నాకు సంబంధం ఉందని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేయలేదా ప్రశ్నించారు.

నా వీడియో చూయించి మాజీ సీఎం సానుభూతి పొందాలని చూశారు. జగన్ ఆయన స్వార్థం కోసం అమ్మపై కేసు పెడతారు ...నాన్న పేరు సీబీఐ చార్జి షీట్‌లో పెడతారు.. తనపై దుష్ప్రచారం చేయిస్తారు’’ అని వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అదానీనీ బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి. ఒక సహచరిగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను.. అదానీతో వ్యాపారం చేయొద్దన్నారు. నేను జగన్మోహన్ రెడ్డినీ ఎత్తి చూపకపోతే నా ఆస్తి నాకు ఇస్తానని అంటున్నారు. కానీ నేను మాట్లాడకుండా ఉండలేను. నేను ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ... ఇలాంటివి నేను మాట్లాడకుంటే ఎలా’’ అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

First Published:  22 Nov 2024 3:17 PM IST
Next Story