Telugu Global
Telangana

షర్మిల గుర్తు బైనాక్యులర్.. ఆమె పోటీ ఎక్కడినుంచంటే..?

ఇప్పుడు గుర్తు ఖరారు కావడంతో షర్మిల మీడియా ముందుకొచ్చే అవకాశాలున్నాయి. ఇంతకీ వైఎస్సార్టీపీ 119 స్థానాల్లో పోటీ చేస్తుందా, లేక కీలక స్థానాలకే పరిమితం అవుతుందా..? వేచి చూడాలి.

షర్మిల గుర్తు బైనాక్యులర్.. ఆమె పోటీ ఎక్కడినుంచంటే..?
X

షర్మిల గుర్తు బైనాక్యులర్.. ఆమె పోటీ ఎక్కడినుంచంటే..?

వైఎస్సార్టీపీకి ఎన్నికల సంఘం గుర్తు కేటాయించింది. తెలంగాణ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు బైనాక్యులర్ గుర్తుపై పోటీ చేస్తారు. షర్మిల పార్టీకి బైనాక్యులర్ గుర్తు ఖరారు చేస్తూ కాసేపటి క్రితం ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులందరి ఉమ్మడి గుర్తుగా ఇది ఉంటుంది. అయితే వైఎస్సార్టీపీకి ఇంకా పర్మినెంట్ సింబల్ రాలేదు. ప్రస్తుతం ఉమ్మడి గుర్తుపై తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉంది.

షర్మిల పోటీ ఎక్కడినుంచి..?

ఓ దశలో వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేద్దామనుకున్నారు షర్మిల. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. కాంగ్రెస్ తో వ్యవహారం తేలకపోయే సరికి షర్మిల ఒంటరి పోటీకి సిద్ధమయ్యారు. తానే రెండు స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. తనతోపాటు తన భర్త, తల్లి కూడా పోటీ చేస్తారని అన్నారు. ఆ తర్వాత అప్లికేషన్ల స్వీకరణ అంటూ హడావిడి కూడా చేశారు. కానీ ఇప్పటి వరకు ముందడుగు పడలేదు. ఇప్పుడు గుర్తు ఖరారు కావడంతో షర్మిల మీడియా ముందుకొచ్చే అవకాశాలున్నాయి. ఇంతకీ వైఎస్సార్టీపీ 119 స్థానాల్లో పోటీ చేస్తుందా, లేక కీలక స్థానాలకే పరిమితం అవుతుందా..? వేచి చూడాలి.

లైట్ తీసుకున్న కాంగ్రెస్..

షర్మిలను మొదట్లో బుజ్జగించాలని చూసినా, తర్వాత ఆమెను కాంగ్రెస్ పూర్తిగా లైట్ తీసుకుంది. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినా చేయకపోయినా తమకు వచ్చే నష్టమేమీ లేదనుకుంటోంది అధిష్టానం. పైగా రేవంత్ రెడ్డికి ఆమెతో పొత్తు అస్సలు ఇష్టం లేదంటున్నారు. దీంతో విలీన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఇప్పుడు షర్మిల బైనాక్యులర్ గుర్తుతో అభ్యర్థుల్ని బరిలో దించుతోంది.

First Published:  26 Oct 2023 3:16 PM
Next Story