ఆమె కమలం కోవర్టు... వైఎస్ షర్మిల Vs కల్వకుంట్ల కవిత
వైఎస్ షర్మిల కమలం వదిలిన బాణమని, బీజేపీ కోవర్టు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శలు గుప్పించారు. షర్మిల ముందుగా కవితను విమర్శిస్తూ ఓ ట్వీట్ చేయడంతో ఇద్దరి మధ్య ట్వీట్ల యుద్ధం నడిచింది.
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల నిన్నటి నుంచి తెలంగాణ ప్రభుత్వం, టీఆర్‌ఎస్ నాయకులపై, కేసీఆర్ పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్న విషయం తెలిసిందే. ఆమె మాటల తీరుపై మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా షర్మిల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై విమర్శలు గుప్పిస్తూ ఓ ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్ లో షర్మిల.. ''పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీల అమలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో 'కవిత'లకు కొదవ లేదు.'' అంటూ కామెంట్ చేశారు.
షర్మిల కామెంట్ కు కవిత ఘాటుగా స్పందించారు. షర్మిల కమలం వదిలిన బాణమని, కమలం కోవర్టు, ఆరెంజ్ ప్యారెట్టు '' అంటూ ట్వీట్ చేశారు.
''అమ్మా.. కమల బాణం
ఇది మా తెలంగాణం
పాలేవో నీళ్ళేవో తెలిసిన
చైతన్య ప్రజా గణం
మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు
నేడు తెలంగాణ రూటు
మీరు కమలం కోవర్టు
ఆరెంజ్ ప్యారెట్టు
మీ లాగా
పొలిటికల్ టూరిస్ట్ కాను నేను
రాజ్యం వచ్చాకే రాలేదు నేను
ఉద్యమంలో నుంచి పుట్టిన
మట్టి " కవిత" ను నేను !'' అని కవిత రూపంలో కామెంట్ చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
అమ్మా.. కమల బాణం
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 30, 2022
ఇది మా తెలంగాణం
పాలేవో నీళ్ళేవో తెలిసిన
చైతన్య ప్రజా గణం
మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు
నేడు తెలంగాణ రూటు
మీరు కమలం కోవర్టు
ఆరేంజ్ ప్యారేట్టు
మీ లాగా
పొలిటికల్ టూరిస్ట్ కాను నేను
రాజ్యం వచ్చాకే రాలేదు నేను
ఉద్యమంలో నుంచి పుట్టిన
మట్టి " కవిత" ను నేను ! https://t.co/rkGthDtHF9
కవిత చేసిన ఈ ట్వీట్ కు నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్రాలో ఊరూరు తిరిగి ఉపన్యాసాలు ఇచ్చిన షర్మిల, ఇప్పుడు తెలంగాణ పై ప్రేమ ఒలకబోయడం విడ్డూరమంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ''రాజన్నా నువ్వు మరణించకపోతే రాష్ట్రం రెండు ముక్కలయ్యేది కాదు'' అని మాట్లాడిన షర్మిల ఇప్పుడు తెలంగాణ కోసం పార్టీ పెట్టడంలో అర్థమేంటి ? ఆమె పార్టీ పెట్టింది బీజేపీ కోసమే. నిజంగానే షర్మిల బీజేపీ వదిలిన బాణం అంటూ మరో నెటిజన్ చురకలు అంటించారు.