Telugu Global
Telangana

భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు

శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తిక పౌర్ణమి సందర్భంగా పంచాక్షరి స్మరణతో మారుమోగుతున్న శైవాలయాలు

భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు
X

కార్తిక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు.వరంగల్‌ వేయిస్తంభాల దేవాలయంలో భక్తులు ఉసిరి చెట్టు కింద పూజలు చేసి దీపాలు వెలిగించారు. అనంతరం స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. కాళేశ్వరం గోదావరి వద్ద కార్తిక పౌర్ణమి శోభ సంతరించుకున్నది. పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించి భక్తులు దీపాలను గంగలోకి వదిలారు. మహబూబా బాద్‌ జిల్లా కందికొండ జాతరకు భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో దైవ దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతున్నది. భద్రాచలంలో గోదావరి తీరాన భక్తులు కార్తిక మాస పుణ్యస్నాన్నాలు ఆచరిస్తున్నారు. కార్తిక దీపాలు వెలిగించి నదిలో వదులుతున్నారు. హైదరాబాద్‌లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. దీపారాధన చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

ఏపీలో సముద్ర, నదీ తీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. అమరావతిలో కృష్ణమ్మ చెంత మహిళలు తెప్పలు వదిలారు. సూర్యలంక, చీరాల, చినగంజాం, పెద గంజాం సముద్ర తీరాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు స్నానమాచరించారు. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీశైలంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ద్రాక్షారామం, కోటప్పకొండ, శ్రీకాళహస్తి, మహానంది తదితర పుణ్యక్షేత్రాల్లో భక్తుల రద్దీ నెలకొన్నది.


First Published:  15 Nov 2024 4:02 AM GMT
Next Story