Telugu Global
Telangana

దళిత మహిళపై థర్డ్ డిగ్రీ.. ఆలస్యంగా నష్ట నివారణ చర్యలు

ఈ దంపతులపై అనుమానంతో డీఐ రామిరెడ్డి 26న వాళ్లను పీఎస్‌కు పిలిపించారు. తాము చోరీ చేయలేదని వారు చెప్పడంతో ఇంటికి పంపేశారు.

దళిత మహిళపై థర్డ్ డిగ్రీ.. ఆలస్యంగా నష్ట నివారణ చర్యలు
X

షాద్‌నగర్‌లో దళిత మహిళ పట్ల పోలీసుల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. దొంగతనం ఒప్పుకోవాలంటూ దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని అంతా తప్పుపట్టారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగా నష్ట నివారణ చర్యలు చేపట్టింది. షాద్‌నగర్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ (డీఐ) రామిరెడ్డితోపాటు మరో ఐదుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.

షాద్‌నగర్‌ ఎస్సీ కాలనీలో ఉండే నాగేందర్‌ తన ఇంట్లో 22.5 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు చోరీ అయ్యాయంటూ జూలై 24న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగేందర్ ఎదురింట్లోనే భీమయ్య, సునీత (35) దంపతులు ఉంటారు. వీళ్లిద్దరు కూలి పనులు చేసుకుంటారు. ఈ దంపతులపై అనుమానంతో డీఐ రామిరెడ్డి 26న వాళ్లను పీఎస్‌కు పిలిపించారు. తాము చోరీ చేయలేదని వారు చెప్పడంతో ఇంటికి పంపేశారు. 30న రాత్రి 8.30 గంటల సమయంలో పోలీసులు మళ్లీ వచ్చి.. పీఎస్‌కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారని బాధిత మహిళ సునీత ఆరోపించారు. తన కొడుకు ముందే చచ్చేలా కొట్టారని చెప్పారు. విషయాన్ని మీడియా హైలైట్ చేసింది. విపక్షాలు కూడా ప్రభుత్వాన్ని నిలదీశాయి. దీంతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు నివేదిక ఆధారంగా బాధ్యుల్ని సస్పెండ్ చేశారు.

First Published:  5 Aug 2024 5:42 PM IST
Next Story