Telugu Global
Telangana

శ్రీవారి వీఐపీ దర్శనాలపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

శ్రీవారి వీఐపీ దర్శనాలపై తెలంగాణ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ సిఫార్సు లేఖలతో వచ్చిన వారిని శ్రీవారి దర్శనానికి అనుమతించకపోవడం బాధాకరమన్నారు.

శ్రీవారి వీఐపీ దర్శనాలపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

తిరుమల వీఐపీ దర్శనాలపై తెలంగాణ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ సిఫార్సు లేఖలతో వచ్చిన వారిని శ్రీవారి దర్శనానికి అనుమతించకపోవడం బాధాకరమన్నారు. సీఎం చంద్రబాబు తెలంగాణ, ఏపీ తనకు రెండు కళ్లలాంటివని తెలిపారు. తిరుమలలో మాత్రం విరుద్దంగా ఉందని ఆయన తెలిపారు. తెలంగాణలో యాదగిరిగుట్ట, భద్రాచలం దేవస్థానాలకు వచ్చే భక్తులకు ఆంధ్రా నాయకులు ఇచ్చే సిఫార్సు లేఖలను తాము అనుమతించి దర్శనాలు కల్పిస్తున్నామని గుర్తు చేశారు. కానీ తమ సొంత మనుషులు, పార్టీ కార్యకర్తలు తిరుమలకు వస్తే కనీసం రూమ్ లు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.

ఏపీలో అధికారంలో ఒక ప్రభుత్వం ఉంటే.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీవారు హైదరాబాద్ లో ఆశ్రయం పొందుతారని, అయినా తాము ఏనాడు ఒక్కమాట కూడా అనలేదన్నారు. ఏపీ వాళ్లు హైదరాబాద్ లో వ్యాపారాలు చేసుకున్నా ఏమీ అనలేదన్నారు. తిరుమలలో తమవాళ్లను అనుమతించనట్లే.. ఏపీ వాళ్లను ఎమ్మెల్యేలంతా కలిసి రాష్ట్రానికి రానివ్వొద్దని తీర్మానం చేస్తే.. ఆ బాధ ఏంటో మీక్కూడా తెలుస్తుందని ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. శ్రీవారి దర్శనాలకు తెలంగాణ నేతలు ఇచ్చే సిఫార్సు లేఖల్ని శాసనసభ సమావేశాల్లో అనుమతించకపోతే.. అసెంబ్లీ సమావేశాల్లో తాము కఠిన నిర్ణయాలు తీసుకుంటామని, తర్వాత మీరే బాధపడతారని హెచ్చరించారు. వ్యాపారం కోసమే హైదరాబాద్ కు రావొద్దన్నారు. నిజమైన అన్నదమ్ముల్లా మెలగుదామని, ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై ఆలోచించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు.

First Published:  21 Oct 2024 9:55 AM GMT
Next Story