Telugu Global
Telangana

మంత్రి కోమటిరెడ్డిపై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మధ్యాహ్నం తాగే కోమటిరెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చిండని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆరోపించారు.

మంత్రి కోమటిరెడ్డిపై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీద ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యాహ్నం తాగి మతిస్థిమితం లేకుండా మాట్లాడే పిస్స ఎంకడు అని రాకేష్‌రెడ్డి అన్నారు. మధ్యాహ్నం మందు తాగే కోమటిరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చిండని ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. నన్ను కాదని ఓడిపోయిన మనిషిని తీసుకొచ్చి ఎమ్మెల్యే పరిచయం చేయడానికి ఎవరు నువ్వు అంటూ నిప్పులు చెరిగారు. నీకు డబ్బు ఎక్కువ ఉంటే మడిచి దగ్గర పెట్టుకో ? కోమటిరెడ్డి అనే పేరు వల్ల బతికిపోయావ్ ? అని మండిపడ్డారు పైడి.

నువ్వు నల్లగొండలో రాజీనామా చెయ్యి నేను నిజామాబాద్ జిల్లాలో రాజీనామా చేస్తా పోటీ చేద్దాం ఎవరు గెలుస్తారో ? అని సవాల్ విసిరారు. నీకు బాగా బలుపు ఉంది మడిచి పెట్టుకో ? అని ఆగ్రహించారు. దక్షిణ తెలంగాణ నుండి ఉత్తర తెలంగాణలో పిచ్చి వాగుడు వాగుతున్నాడని రాకేష్ రెడ్డి అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిజామాబాద్ పర్యటనలో భాగంగా చేసిన కామెంట్స్‌పై స్పందిస్తూ.. మంత్రిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నాలుగు సార్లు గెలిచిన అని గొప్పలు చెప్పుకునే వ్యక్తికి ఎలా మట్లాడాలో తెలియదా అని ఆగ్రహం వ్యక్తం పైడి చేశారు.

First Published:  4 Dec 2024 2:46 PM IST
Next Story