Telugu Global
Telangana

ఎల్లుండే రూ.లక్ష రుణమాఫీ.. రేవంత్ సంచలనం

భూమి పాస్ బుక్ ఆధారంగానే రూ.2 లక్షల రుణమాఫీ జరుగుతుందని, రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు మాత్రమే రేషన్ కార్డు అవసరమని చెప్పారు.

ఎల్లుండే రూ.లక్ష రుణమాఫీ.. రేవంత్ సంచలనం
X

తెలంగాణలో రైతు రుణమాఫీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్. ఈ నెల 18న సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో లక్ష రూపాయలు జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్లు, అధికారుల సదస్సులో స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం రైతు వేదికల్లో రైతులతో సంబరాలు చేయాలని నిర్ణయించింది. ఇక రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా చూడాలని బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు రైతు రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై.. ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో క్లారిటీ ఇచ్చారు సీఎం. భూమి పాస్ బుక్ ఆధారంగానే రూ.2 లక్షల రుణమాఫీ జరుగుతుందని, రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు మాత్రమే రేషన్ కార్డు అవసరమని చెప్పారు. ఈ మేరకు కలెక్టర్లు, అధికారుల సదస్సులో స్పష్టం చేశారు.

తెలంగాణలో రైతులకు రూ.2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి సోమవారం గైడ్‌లైన్స్ కూడా రిలీజ్ చేసింది ప్రభుత్వం. అయితే రేషన్ కార్డు, పీఎం కిసాన్ మినహాయింపులను ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పడం గందరగోళానికి దారితీసింది. తాజాగా దీనిపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు.

First Published:  16 July 2024 12:52 PM GMT
Next Story