Telugu Global
Telangana

సెం'గోల్ మాల్'.. రాజదండంపై కేటీఆర్ సెటైర్లు

సెంగోల్ పేరు చెప్పి దక్షిణాదివారిని ఐస్ చేసిన కేంద్రం.. మరో డైవర్షన్ గేమ్ మొదలుపెట్టిందనడంలో సందేహం లేదు. ఈ వ్యవహారాన్ని గోల్ మాల్ గా అభివర్ణించారు మంత్రి కేటీఆర్.

సెంగోల్ మాల్.. రాజదండంపై కేటీఆర్ సెటైర్లు
X

కొత్త పార్లమెంట్ లో సెంగోల్ అనబడే రాజదండాన్ని ప్రతిష్టించారు ప్రధాని మోదీ. ఆ సెంగోల్ వ్యవహారంలో బీజేపీ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అప్పట్లో రాజ్యాధికారాన్ని అప్పగిస్తూ మౌంట్ బాటన్ ఈ రాజదండాన్ని నెహ్రూకి అప్పగించారని, కాంగ్రెస్ ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోలేదని, వాకింగ్ స్టిక్ లాగా పక్కనపెట్టేశాయని, దానికి తాము గౌరవాన్ని కల్పిస్తున్నామని చెప్పుకున్నారు. చివరకు ప్రధాని చేతుల మీదుగా ఆ రాజదండాన్ని పార్లమెంట్ లో ప్రతిష్టించారు. అక్కడి వరకు బాగానే ఉంది. అయితే దాన్ని దక్షిణాదికి ప్రతిబింబంగా చూపెడుతూ కొత్త మాయ మొదలైందనే కామెంట్లు వినపడుతున్నాయి. ఈ వ్యవహారాన్ని గోల్ మాల్ గా అభివర్ణించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. సెంగోల్ నుంచి సెం'గోల్ మాల్' అనే కొత్త పదాన్ని ఆవిష్కరించారు.


సడన్ గా ఎందుకు..?

బీజేపీ అధికారంలోకి వచ్చి 9ఏళ్లవుతోంది. ఇప్పటి వరకు సెంగోల్ గురించి ఎక్కడా ఆ పార్టీ నేతలు ప్రస్తావించలేదు, దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన దాఖలాలు లేవు. హఠాత్తుగా పార్లమెంట్ ఆవిష్కరణ సందర్భంలో దానికి ఎక్కడలేని ప్రయారిటీ ఇచ్చారు. నూతన పార్లమెంట్ ని రాష్ట్రపతి చేతులమీదుగా ప్రారంభించడంలేదని ప్రతిపక్షాలు ఓవైపు విమర్శిస్తుండగా సెంగోల్ వ్యవహారాన్ని హైలెట్ చేసి, ఆ విమర్శలను డైవర్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం.

రాజదండానికి ఇచ్చిన ప్రాధాన్యత ప్రజలకు లేదా..?

దక్షిణాదికి చెందిన చోళ రాజుల సంప్రదాయానికి ప్రాధాన్యత ఇచ్చామని చెబుతున్నారు బీజేపీ నేతలు. అదే సమయంలో తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిందేంటో తెలుసా..? 2026లో లోక్ సభ సీట్ల పునర్ వ్యవస్థీకరణలో హ్యాండ్ ఇచ్చారు. అవును, పార్లమెంట్ 888 మంది సభ్యులు కూర్చోడానికి అనుకూలంగా ఉందని చెప్పిన మోదీ.. ఆ పెరిగిన సీట్లు కేవలం ఉత్తరాదివారికేననే విషయాన్ని మాత్రం హైలెట్ చేయలేదు. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు ఉంటుంది కాబట్టి, ఈసారి దక్షిణాదికి మొండిచెయ్యి చూపించబోతున్నారు. అదే సమయంలో బీజేపీకి బలం ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్ సభ సీట్లు పెరిగితే అది ఆ పార్టీకి అయాచిత వరంలా మారుతుంది. మొత్తమ్మీద సెంగోల్ పేరు చెప్పి దక్షిణాదివారిని ఐస్ చేసిన కేంద్రం.. మరో డైవర్షన్ గేమ్ మొదలుపెట్టిందనడంలో సందేహం లేదు.

First Published:  30 May 2023 4:38 PM IST
Next Story