సీతక్కకు హోం మంత్రి.. కేబినెట్ విస్తరణపై దామోదర లీకులు
దానం నాగేందర్ బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరగా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉన్నారు. ఇక నిజామాబాద్ జిల్లా నుంచి ఒకరికి కేబినెట్‌లో స్థానం దక్కుతుందన్నారు దామోదర.
తెలంగాణ కేబినెట్ విస్తరణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ కేబినెట్‌లో ప్రస్తుతం ఆరు కేబినెట్ బెర్తులు ఖాళీగా ఉండగా.. ఆశావహులు మాత్రం పెద్ద ఎత్తున ఉన్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఢిల్లీలో లాబీయింగ్ కూడా చేస్తున్నారు.
తాజాగా కేబినెట్ విస్తరణపై లీకులిచ్చారు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు. ప్రస్తుతమున్న మంత్రుల శాఖల్లోనూ మార్పులు, చేర్పులు ఉంటాయన్నారు. సీతక్కకు హోం మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఇక కేబినెట్‌లోకి దానం నాగేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటామన్నారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరగా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉన్నారు. ఇక నిజామాబాద్ జిల్లా నుంచి ఒకరికి కేబినెట్‌లో స్థానం దక్కుతుందన్నారు దామోదర.
వారం, 15 రోజుల్లో కేబినెట్ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేబినెట్ విస్తరణతో పాటు పీసీసీ నియామకంపై హైకమాండ్‌తో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇతర పార్టీల నుంచి చేరిన వారికి కేబినెట్‌లో చోటివ్వమని రేవంత్ ప్రకటించారు. కాగా, సిటీలో కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేలు లేకపోవడంతో బీఆర్ఎస్ నుంచి వచ్చిన దానంకు మంత్రి పదవి వరించే అవకాశం ఉందని తెలుస్తోంది.