Telugu Global
Telangana

హై అలర్ట్.. దయచేసి నలుగురికి మించి రావద్దు..!

ఎల్లుండే పంద్రాగస్టు. ఇప్పటికే పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. భద్రతకు ముప్పు వాటిల్లకుండా రాష్ట్ర, కేంద్ర పోలీసు బలగాలు సెక్యురిటీని కట్టుదిట్టం చేశాయి. ప్రత్యేక తనిఖీలు చేస్తున్నాయి.

హై అలర్ట్.. దయచేసి నలుగురికి మించి రావద్దు..!
X

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రయాణికుల తాకిడి రోజు రోజుకూ విప‌రీతంగా పెరుగుతోంది. అధికారుల లెక్క‌ల‌ ప్రకారమైతే.. రోజుకు సగటుకు 5వేల మంది విద్యార్థులు విదేశాలు బయల్దేరుతున్నారు. ఈ కారణంగా రద్దీ రోజురోజుకూ పెరుగుతూ విమానాశ్రయ పరిసర ప్రాంతాలు జనసమ్మర్థంగా మారుతున్నాయి. కొందరు ప్రయాణికులైతే సమయానికి విమానాన్ని అందుకోలేని సందర్భాలు కూడా తలెత్తుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే అధికారులు ఈ విషయాన్ని ఓ సారి ప్రజలకు విన్నవించారు. ఒక ప్రయాణికుడి కోసం 10 నుంచి 15 మంది విమానాశ్రయానికి రావడం తమకు ఇబ్బందికరంగా మారుతోందన్నారు. వీడ్కోలు చెప్పాలనుకునేవాళ్లు నలుగురికి మించి రావద్దని కోరుతున్నారు. కుటుంబ సభ్యులే కాకుండా.. స్నేహితులు, బంధువుల వంటివారు కూడా వీడ్కోలుకు వస్తున్న కారణాలతో పార్కింగ్ సమస్యలు, సెక్యురిటీ ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని అధికారులు తెలిపారు.

ఎల్లుండే పంద్రాగస్టు. ఇప్పటికే పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. భద్రతకు ముప్పు వాటిల్లకుండా రాష్ట్ర, కేంద్ర పోలీసు బలగాలు సెక్యురిటీని కట్టుదిట్టం చేశాయి. ప్రత్యేక తనిఖీలు చేస్తున్నాయి. దీనికి తోడు.. రద్దీ కుడా నాలుగైదు రోజులుగా పెరుగుతూ పోతోంది. ఈ విషయాలన్నింటినీ మరోసారి ప్రజలకు గుర్తు చేస్తున్న అధికారులు.. విదేశాల‌కు వెళ్లే విమాన ప్రయాణికులకు సెండాఫ్ చెప్పేందుకు దయచేసి ముగ్గురు, నలుగురి కంటే ఎక్కువ మంది రావొద్దని కోరుతున్నారు.

First Published:  13 Aug 2023 2:09 PM IST
Next Story