Telugu Global
Telangana

రేవంత్ రెడ్డి నివాసం వద్ద భద్రత పెంపు

ఇంటెలిజెన్స్ పోలీసులు రేవంత్ నివాసం వద్దకు వచ్చి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం తాత్కాలిక సీఎం కాన్వాయ్‌ని కూడా అధికారులు సిద్ధం చేశారు.

రేవంత్ రెడ్డి నివాసం వద్ద భద్రత పెంపు
X

కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత‌గా ఎంపికైన రేవంత్ రెడ్డి.. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసం వద్ద పోలీసులు భద్రత పెంచారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీబీఐ కాలనీలో రేవంత్ రెడ్డి నివాసం ఉంది. అక్కడ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పూర్తిస్థాయి సెక్యూరిటీని కల్పించనున్నారు. రేవంత్ నివాసం నుంచి బయటికి వచ్చే రూట్‌ను పోలీసులు క్లియర్ చేస్తున్నారు.

రేవంత్ నివాసం వద్ద చెట్ల కమ్మలు అడ్డుగా ఉండటంతో జీహెచ్ఎంసీ సిబ్బంది వాటిని తొలగించే పనులు చేపట్టారు. రేవంత్ రెడ్డి నివాసానికి 200 మీటర్ల దూరంలోనే బారికేడ్లు ఏర్పాటు చేసి ఆంక్షలు కూడా విధించారు. ఇంటెలిజెన్స్ పోలీసులు రేవంత్ నివాసం వద్దకు వచ్చి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం తాత్కాలిక సీఎం కాన్వాయ్‌ని కూడా అధికారులు సిద్ధం చేశారు.

ప్రస్తుతం రేవంత్ రెడ్డి నివాసం వద్ద 15 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండటంతో ఆయన ఇంటి వద్ద పెద్దగా హడావుడి కనిపించడం లేదు. ఆయన హైదరాబాద్ చేరుకున్న తర్వాత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆయనను కలిసేందుకు పెద్ద సంఖ్యలో ఇంటి వద్దకు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసు ఉన్నతాధికారులు సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం నివాసంతో పాటు గాంధీ భవన్‌లో కూడా భద్రతను పెంచనున్నారు.

First Published:  6 Dec 2023 11:17 AM IST
Next Story