ఘనంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు
ఈ ఆదివారం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, బోనం సమర్పించారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. పట్టు వస్త్రాలు, బోనం సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మారావు నివాసంలోని ముత్యాలమ్మ గుడిలో సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో అమ్మవారికి సీఎం శ్రీ కేసీఆర్ శోభమ్మ దంపతులు బోనాల పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
— BRS Party (@BRSparty) July 9, 2023
ఆలయానికి చేరుకున్న సీఎం దంపతులను వేదమంత్రాలతో పూజారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సాంప్రదాయ పద్ధతిలో పట్టు వస్త్రాలను సీఎం కేసీఆర్ గారు… pic.twitter.com/ng4HhL7mCG
బోనమెత్తిన కవిత..
ఎమ్మెల్సీ కవిత సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి బోనం సమర్పించారు. బంగారు బోనంతో ఆమె అమ్మవారి ఆలయానికి వచ్చారు. బోనాల సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద భక్తుల రద్దీ పెరిగింది. మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Honoured to be a part of the vibrant Bonalu festival in Secunderabad today #BonaluFestival #TelanganaPride pic.twitter.com/DxxChxkRhI
— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 9, 2023
ఆషాఢమాసం సందర్భంగా తెలంగాణలో బోనాల పండగ ఘనంగా జరుగుతోంది. ఈ ఆదివారం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, బోనం సమర్పించారు.