Telugu Global
Telangana

సికిందరాబాద్ అగ్ని ప్రమాదం: ఇప్పటి వర‌కు లభించని ఆ ముగ్గురి ఆచూకీ, డ్రోన్ల సహాయంతో సెర్చింగ్

భవనం లోపలికి వెళ్ళి పరిశీలించే పరిస్థితి ఇప్పటికీ లేదు. భవనం లోపలంతా బూడిద కుప్పలున్నాయి. భవనం గోడలతొ సహా బూడిద కూడా ఇప్పటికీ వేడిగానే ఉండటంతో పోలీసులు లోపలికి వెళ్ళ లేక పోతున్నారు. అయితే అధికారులు డ్రోన్ల సహాయంతో మృత దేహాల కోసం లోపల సర్చ్ చేశారు.

సికిందరాబాద్ అగ్ని ప్రమాదం: ఇప్పటి వర‌కు లభించని ఆ ముగ్గురి ఆచూకీ, డ్రోన్ల సహాయంతో సెర్చింగ్
X

సికిందరాబాద్ రాంగోపాల్ పేటలోని డెక్క న్ షాపింగ్ మాల్ లో గురువారంనాడు జరిగిన అగ్నిప్రమాదంలో గల్లంతయిన ముగ్గురి ఆచూకీ ఇప్పటి వరకు లభించడం లేదు. డెక్కన్ కార్పొరేట్ ఉద్యోగులు జునైద్, వసీం , జహీర్ లు ముగ్గురు మంటల్లో సజీవదహనం అయ్యారని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికి ఇప్పటి వరకు మృతదేహాలు కనపడటం లేదు. వీళ్ళ ముగ్గురి సెల్ ఫోన్ లొకేషన్లు మాత్రం మొన్న రాత్రి వరకూ అక్కడే చూపించాయి. అయితే ఆ తర్వాత అవి స్విచ్ ఆఫ్ అయిపోయాయి.

భవనం లోపలికి వెళ్ళి పరిశీలించే పరిస్థితి ఇప్పటికీ లేదు. భవనం లోపలంతా బూడిద కుప్పలున్నాయి. భవనం గోడలతొ సహా బూడిద కూడా ఇప్పటికీ వేడిగానే ఉండటంతో పోలీసులు లోపలికి వెళ్ళ లేక పోతున్నారు. అయితే అధికారులు డ్రోన్ల సహాయంతో మృత దేహాల కోసం లోపల సర్చ్ చేశారు.

డ్రోన్ కెమెరా చిత్రీకరించిన వీడియోల్లో రెండో అం తస్తులో భవనం వెనుక వైపు రెండు చోట్ల మృతదేహాలు ఉన్న ట్లు ఆనవాళ్లను శుక్రవారం సాయం త్రం గుర్తిం చారు. అయితే అవి స్పష్టంగా కనిపిం చకపోవడం తో అవిమృతదేహాలేనా కాదా అనే విషయాన్ని స్పష్టం గా చెప్ప లేకపోతున్నారు. దీం తో డ్రోన్ కెమెరాచిత్రీకరించిన వీడియోను ఇంప్రొవైజేషన్ విధానం లో విశ్లేషిం చడానికి అధికారులు ల్యాబ్ కు పంపించారు.

శుక్రవారం రాత్రి ఆపరేషన్ ఆపేసిన అధికారులు ఈ రోజు మళ్లీ ప్రారంభిం చాలని నిర్ణయిం చారు. అయితే భవనం మొత్తం మంటలు వ్యాపించిన తీరు, దాదాపు 8 గంటల పాటు మంటలు ఆరకపోవడం, లోపలి పరిస్థితులు, భవనమే కూలి పోయే పరిస్థితికి చేరుకోవడం... తదితర పరిస్థితుల ఆధారంగా ఆచూకీ లభించని ఆ ముగ్గురు బతికి ఉండే అవకాశం లేదని, అసలు వారి ఎముకలు కూడా దొరొకే అవకాశాలు కూడా తక్కువేనని ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు.

First Published:  21 Jan 2023 9:44 AM IST
Next Story