Telugu Global
Telangana

తెలంగాణ సచివాలయ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌

రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్‌ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ సచివాలయ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌
X

సచివాలయ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ధర్నాలు, ర్యాలీలను నిషేధించింది. ఇందిరాపార్క్‌లో ధర్నాలు, ర్యాలీలు తీసుకోవచ్చని పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలే సెక్రటేరియట్‌లో వాస్తు మార్పులు చేసిన విషయం తెలిసిందే. లుంబిని పార్క్ ఎదురుగా ఉన్న ప్రధాన గేట్‌ను శాశ్వతంగా మూసివేసింది. ఎన్టీపార్క్ వైపు ఈశాస్యంలో మరో గేటు నిర్మాణం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ గేటు నుంచే ముఖ్యమంత్రి, మంత్రులు సచివాలయంలోకి వెళ్లనున్నారు. ఇక సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ గేట్లను కలుపుతూ 27 ఫీట్లతో రోడ్డు మార్గాన్ని నిర్మించడానికి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. పోలీసుల ఆదేశాలు పాటించకుండా, అనుమతి లేకుండా సమావేశాలు, ధర్నాలు, నిరసనలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రజలు సహకరించాలని కోరారు.

First Published:  11 Nov 2024 7:54 PM IST
Next Story